JNTUH లో భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య
కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌పరిధిలోని JNTUH లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నాలుగవ సంవత్సరం చదువుతున్న ఎసానక మేఘన(21), బుధవారం వర్సిటిలోని భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
దిశ, కూకట్పల్లి: కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌పరిధిలోని JNTUH లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నాలుగవ సంవత్సరం చదువుతున్న ఎసానక మేఘన(21), బుధవారం వర్సిటిలోని భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కేపీహెచ్‌బీ సీఐ కిషన్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం గత కొంత కాలంగా మేఘన అనారోగ్య సమస్యలతో బాధపడుతుందని, దీంతో మనస్తాపానికి గురైన మేఘన ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారని అన్నారు. నెల్లూరుకు చెందిన ఈ మనోజ్‌కుమార్‌రెడ్డి కుటుంబం గత కొంత కాలం క్రితం నగరానికి వచ్చి కూకట్‌పల్లిలోని వివేకానందనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. గత కొంత కాలంగా మానసిక నిపుణుల వద్ద వైద్యం చేయించుకుంటుంది. కాగా మేఘన తన అనారోగ్య సమస్యలతో మనస్తాపం చెంది బుధవారం మూడవ అంతస్థులో ఉన్న తన క్లాస్ రూం బాల్కాని నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలైన మేఘనను స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మేఘన మృతి చెందినట్లు సీఐ కిషన్‌కుమార్ తెలిపారు.