హ్యాట్రిక్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు షాక్.. బీజేపీఎల్పీ లీడర్ ఖరారు..!

బీజేపీఎల్పీ నేతగా నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి అవకాశమివ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.

Update: 2023-12-19 02:17 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీఎల్పీ నేతగా నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి అవకాశమివ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. శాసనసభాపక్ష నేత పదవి కోసం ఏలేటి మహేశ్వర్ రెడ్డితో పాటు రాజాసింగ్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తెలంగాణపై పట్టున్న ఏలేటికే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పార్టీవర్గాల్లో చర్చ జరుగుతున్నది.

రాజాసింగ్ మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనా.. తెలుగు భాషపై పట్టు లేకపోవడం, గోషామహల్ సెగ్మెంట్, హిందుత్వ ఎజెండాకు మాత్రమే పరిమితం కావడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఆయనకు అవకాశం దక్కడం డౌటేనని టాక్. అయితే కేసీఆర్, రేవంత్ రెడ్డిని ఓడించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపెల్లి రమణారెడ్డికి ఎల్పీ నేతగా అవకాశమిస్తే ఎలా ఉంటుందని సైతం అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఆయన తొలిసారి ఎమ్మెల్యే కావడం గమనార్హం. కాగా, ఈ నెల 24న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు రానున్నట్లు తెలిసింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నేతలకు దిశా నిర్దేశం చేసేందుకు వస్తున్న ఆయన బీజేపీఎల్పీ నేతపై క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం.

Tags:    

Similar News