పాఠశాల బస్సు ఢీ.. వ్యక్తి మృతి

వాకింగ్‌కి వచ్చి నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని స్కూల్ బస్సు ఢీ కొనగా అక్కడి కక్కడే మృతి చెందాడు.

Update: 2023-03-31 04:46 GMT
పాఠశాల బస్సు ఢీ.. వ్యక్తి మృతి
  • whatsapp icon

దిశ, పరిగి : వాకింగ్‌కి వచ్చి నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని స్కూల్ బస్సు ఢీ కొనగా అక్కడి కక్కడే మృతి చెందాడు. పరిగి శ్రీనివాస్ కాలనీ‌కి చెందిన వారాల రాజ్ కుమార్( 55) పరిగి రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందు టీ హోటల్ పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడి కోలుకోంటున్నాడు. వాకింగ్ చేద్దామని శుక్రవారం ఉదయం ఇంట్లోంచి బయటికి వెళ్లాడు.

పరిగి తహసీల్దార్ కార్యాలయం వద్ద సీసీ రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా పరిగి నుంచి వికారాబాద్ వైపునకు వెళ్తున్న శ్రీ చైతన్య పాఠశాలకు చెందిన బస్సు రాష్ డ్రైవింగ్ చేస్తూ రాజ్ కుమార్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాజ్ కుమార్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. రాజ్ కుమార్‌కు భార్య ప్రభావతి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. రోడ్డు మలుపు వద్ద వేగంగా, నిర్లక్ష్యంగా బస్సు నడపడం వల్లే ఓ నిండు ప్రాణం బలి కొన్నారని బాధిత కుటుంబీకులు, స్థానికులు మండిపడ్డారు. విషయం తెలుసుకొని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పరిగి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కుటుంబీకులను పరామర్శించారు.

Tags:    

Similar News