జిల్లా కలెక్టర్ తల్లిదండ్రులకు తృటిలో తప్పిన ప్రమాదం

మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ పరిధి కరీంగూడ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.

Update: 2023-05-06 03:21 GMT

దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్ : మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ పరిధి కరీంగూడ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ తల్లిదండ్రులు గంగాధర్, గంగామణి, కలెక్టర్ వాహన డ్రైవర్ రామకృష్ణ లకు గాయాలయ్యాయి. వాహనం కూడా తీవ్రంగా దెబ్బతింది. కూలీలతో వెళుతున్న వాహనాన్ని వేగంగా ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News