మంథనిలో టీఆర్ఎస్ నేతల దౌర్జన్యం.. కేసు నమోదు (వీడియో)
దిశ ప్రతినిధి, కరీంనగర్: మంథని టీఆర్ఎస్ నాయకులపై మంథనిలో కేసు నమోదు అయింది.
దిశ ప్రతినిధి, కరీంనగర్: మంథని టీఆర్ఎస్ నాయకులపై మంథనిలో కేసు నమోదు అయింది. క్రైం నెంబర్ 161/2022లో 448, 427 రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్లలో కేసు నమోదు చేసి మంథని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెల్తే... మంథని పట్టణంలోని గాంధీ చౌక్ రణధీర్ రెడ్డికి చెందిన ఇంటి వద్దకు చేరుకున్న మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్, మల్క రామారావు, బుద్దె ఉదయ్ చైతన్య, లక్కిరెడ్డి నర్సింహరెడ్డి, దారుముల సంపత్, రామిడి సుదర్శన్ రెడ్డిలు కలిసి షట్టర్, గేటు తాళాలు పగలగొట్టడంతో పాటు సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. తన అవసరాల కోసం ఇంటిని రామిడి సుదర్శన్ రెడ్డికి జీపీఏ చేస్తే మోసం చేసి బుద్దె ఉదయ్ చైతన్య, లక్కిరెడ్డి నర్సింహరెడ్డిలకు విక్రయించాడని రణధీర్ రెడ్డి ఆ ఫిర్యాదులో వివరించారు. ఈ విషయంలో తాను జీపీఏ క్యాన్సిల్ చేయలని కోరుతు కోర్టును ఆశ్రయించడంతో పాటు ఇంజక్షన్ ఆర్డర్ కూడా తీసుకున్నానని రణధీర్ రెడ్డి తెలిపారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంథని పోలీసులు కేసు నమోదు చేశారు.
నెట్టింట వైరల్..
రణధీర్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకుని గడ్డపరాలతో తచ్చాడుతున్నట్టుగా సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫుటేజ్ నెట్టింట వైరల్‌గా మారింది. మంథని టీఆర్ఎస్ ఇన్‌చార్జి, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు ప్రధాన అనుచరుడిగా చెలామణీ అవుతున్న పూదరి సత్యనారాయణ గౌడ్ ఫుటేజీలో ఉన్నాడన్న విషయాన్ని ఎత్తి చూపుతూ నెటిజన్లు ఈ ఫుటేజీని తెగ వైరల్ చేస్తున్నారు. మంథని టీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు కావడం పెద్దపల్లి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
మునుగోడు టీఆర్ఎస్‌లో అసంతృప్తి.. మంత్రికి తలనొప్పిగా మారిన వైనం..