కేటీఆర్‌పై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు
ఎన్నికలు సమీపిస్తోన్న వేళ బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. లిక్కర్ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత జైలు పాలు కాగా, ఇదే అదునుగా భావించి వరుసగా కీలక నేతలంగా పార్టీకి రాజీనామా చేస్తున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు సమీపిస్తోన్న వేళ బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. లిక్కర్ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత జైలు పాలు కాగా, ఇదే అదునుగా భావించి వరుసగా కీలక నేతలంతా పార్టీకి రాజీనామా చేస్తున్నారు. కవిత కేసును సాకుగా చూపి గుబ్ బై చెబుతున్నారు. మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసిస్తూ హన్మకొండయ పీఎస్‌లో కాంగ్రెస్ శ్రేణులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
తాజాగా ఇవాళ హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పీఎస్‌లో మరో కేసు నమోదు అయింది. బత్తిన శ్రీనివాస్ రావు అనే కాంగ్రెస్ నేత ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఐ పీసీ 504,505(2) కింద కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పలువురు కాంట్రాక్టర్లు, బిల్డర్ల వద్ద సుమారు రూ.2500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపించాడని కేటీఆర్ చేసిన ఆరోపణలపై ఈ కేసులు నమోదు చేశారు. ఈ పరిణామాలు గులాబీ క్షేత్రస్థాయి నేతలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి.