మాజీ మంత్రి మల్లారెడ్డి, MLA రాజశేఖర్ రెడ్డిపై కేసు నమోదు
బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు అయ్యింది. మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపైన
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు అయ్యింది. మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపైన పోలీసులు కేస్ ఫైల్ చేశారు. రెండున్న ఎకరాల స్థల వివాదంలో జోక్యం చేసుకోవడంతో పాటు పేట్ బషీరాబాద్‌లోని ఓ ల్యాండ్‌లో ఫెన్సింగ్ కూలగొట్టి దౌర్జన్యం చేశారని బాధితులు మల్లారెడ్డి, ఆయన అల్లుడిపై కంప్లైంట్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పేట్ బషీర్‌బాద్ పోలీసులు మామఅలుళ్లపై కేసు నమోదు చేశారు. వీరితో పాటుగా వీరికి సపోర్ట్‌గా వెళ్లిన పలువురు కార్యకర్తలపైన కేసు ఫైల్ అయ్యింది.
అనంతరం మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డిని సొంత పూచీకత్తూపై పోలీసులు విడుదల చేశారు. కాగా, సుచిత్రలోని రెండు ఎకరాల స్థలం విషయంలో మల్లారెడ్డికి మరో 15 మందికి వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. స్థలం తమదని, అక్రమంగా కబ్జా చేసి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారని మల్లారెడ్డి ఆరోపించారు. తమ భూమిలో వేసిన ఫెన్సింగ్ తొలగించాలని మల్లారెడ్డి తన అనుచరులను ఆదేశించగా.. వారు ఫెన్సింగ్‌ను పడగొట్టారు. ఈ క్రమంలో మల్లారెడ్డికి, ఎదుటి వ్యక్తులకు తీవ్ర వాగ్వాదం చేసుకుంది. దీంతో రంగ ప్రవేశం పోలీసులు ఇరువురిని చెదరగొట్టి.. మల్లారెడ్డి, ఆయన అల్లుడి రాజశేఖర్ రెడ్డిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.