Smart Helmet: 9వ తరగతి విద్యార్థి కొత్త ఆవిష్కకరణ.. ఫిదా అయిన కలెక్టర్..

మన దేశంలోనిత్యం గంటకు 19మంది ప్రమాదాల్లో ప్రాణాలను కోల్పోతున్నారు.

Update: 2024-03-23 04:39 GMT

దిశ వెబ్ డెస్క్: మన దేశంలోనిత్యం  గంటకు 19మంది ప్రమాదాల్లో ప్రాణాలను కోల్పోతున్నారు. ముఖ్యంగా ఈ ప్రమాదాలు యూటర్న్ తీసుకునే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా జరుగుతుంటే.. ద్విచక్ర వాహనాలు నడిపేవాళ్లు హెల్మెట్ పెట్టుకోకపోవడం కారణంగానే ఈ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని సర్వ్ లు పేర్కొంటున్నాయి.

అయితే ఈ ప్రమాదాలను అరికట్టేందుకు అవగాహనా కార్యక్రమాలు చేప్పట్టిన అందరూ వింటారని గ్యారెంటీ లేదు. అయినా సరే ఈ ప్రమాదాలను అరికట్టాలి అనుకున్నారు. అనుకున్నట్టుగానే తన మెదడుకు పనిపెట్టారు.. చివరికి ద్విచక్రవాహనాలను స్టార్ట్ చెయ్యాలి అని అనుకున్న సరే కచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకుంటే చాలు బైక్ స్టార్ట్ అయిపోతుంది.

హెల్మెట్ ధరించకపోతే తలకిందులుగా తపస్సు చేసిన స్టార్ట్ కాదు. ఇంత గొప్ప ఆవిష్కరణ చేసి మనసుంటే మార్గం ఉంటుంది అని నిరూపించింది కేవలం 9వ తరగతి విద్యార్థి. మంచిర్యాల జిల్లా నస్పూర్  కు చెందిన సాయి అనే బాలుడు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్ లో 9వ తరగతి చదువుతున్నారు. అయితే హెల్మెట్ ధరించకుండా బండి నడపడం కారణంగా చాలామంది ప్రాణాలను కోల్పోతున్నారని ఆవేధనకు గురైన సాయి ఎలాగైనా ప్రజలు హెల్మెట్ ధరించేలా చెయ్యాలి అనుకున్నారు.

అనుకున్నట్టుగానే సెన్సార్ ను ఉపయోగించి హెల్మెట్ పెట్టుకుంటేనే బండి స్టార్ట్ అయ్యేలా స్మార్ట్ హెల్మెట్ ను తాయారుచేశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న మంచిర్యాలకు కలెక్టర్ సాయిని అతని తల్లిదండ్రులను కలెక్టర్ కార్యాలయానికి పిలిపించి సాయిని.. సాయిని ప్రోత్సహించిన అతని తల్లిదండ్రులను మెచ్చుకున్నారు.   

Tags:    

Similar News