Damodara Rajanarsimha: ఆయుర్వేద వైద్యుల పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరిస్తాం: మంత్రి దామోదర
ఆయుర్వేద వైద్యుల పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు.
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో మరో 214 యోగా ఇన్ స్టిట్యూట్స్ ను మంజూరు చేస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Raja Narsimaha) చెప్పారు. హైదరాబాద్ లో నిర్వహించిన 9వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంలో (9 Ayurveda Day) పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. డైరెక్టర్ ఆఫ్ ఆయుర్వేదను మంజూరు చేసుకోవాల్సి ఉందన్నారు. ఆయుర్వేద వైద్యుల పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. ప్రమోషన్ల అంశంతో పాటు మమ్మల్ని కూడా ప్రోఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా గుర్తించాలనే డిమాండ్లు ఉన్నాయని వాటిని పరిష్కరిస్తామన్నారు. ఇది మీ ప్రభుత్వమని త్వరలోనే సానుకూలమైన ఉత్తర్వులు వస్తాయన్నారు. యావత్ ప్రపంచం యోగా, ఆయుర్వేదాన్ని గౌరవిస్తున్నదన్నారు. ఆయుర్వేదం ప్రకృతితో సంబంధం ఉన్న వైద్యం అని ప్రకృతిలో ఉన్న రహస్యాలను 3 వేల సంవత్సరాల నుంచి చేధించి అందించిన చరిత్ర ఆయుర్వేదం అన్నారు. ఆయుర్వేదం అంటే మాకు అపారమైన గౌరవం ఉందని రాబోయో రోజుల్లో తెలంగాణ ఆయుష్ డిపార్ట్ మెంట్ కు మరింత మంచి పేరు తీసుకురావాలని సూచించారు.