ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యా శాఖ మంత్రికి 1998 డీఎస్సీ సాధన సమితి వినతి
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ అమలు అవుతుందన్న విశ్వాసంతో నిరీక్షిస్తున్న తెలంగాణ రాష్ట్ర డీఎస్సీ-98 క్వాలిఫైడ్ అభ్యర్థులు అందరికీ త్వరితగతిన ఉద్యోగాలిచ్చి న్యాయం చేసేలా సీఎం కేసీఆర్‌తో మాట్లాడి ఒప్పించాలని కొడంగల్ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డిని కోరారు.
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ అమలు అవుతుందన్న విశ్వాసంతో నిరీక్షిస్తున్న తెలంగాణ రాష్ట్ర డీఎస్సీ-98 క్వాలిఫైడ్ అభ్యర్థులు అందరికీ త్వరితగతిన ఉద్యోగాలిచ్చి న్యాయం చేసేలా సీఎం కేసీఆర్‌తో మాట్లాడి ఒప్పించాలని కొడంగల్ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డిని కోరారు. మంగళవారం 1998 డీఎస్సీ సాధన సమితి అధ్యక్ష, కార్యదర్శులు, ఎమ్మెల్యేతో కలిసి విద్యాశాఖ మంత్రికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పదోన్నతుల ప్రక్రియ ముగిస్తే ఉపాధ్యాయ పోస్టుల వేకెన్సీ పై స్పష్టత వస్తుంది. ఆ తర్వాత వెనువెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో మాట్లాడి డీఎస్సీ-1998 క్వాలిఫైడ్ అభ్యర్థులకు న్యాయం చేయిస్తానని ఆమె హామీ ఇచ్చారు. అనంతరం వారు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్‌ను కూడా కలిసి వినతిపత్రం అందజేశారు.