అసమర్ధ కంపెనీకి ‘ధరణి’ అప్పగింత.. తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ఫైర్

దిశ, తెలంగాణ బ్యూరో: భూముల సమస్యలను గుర్తించకుండా గుడ్డిగా ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చారని, సామర్ధ్యం లేని సాఫ్ట్​వేర్ కంపెనీకి బాధ్యతలు అప్పగించారని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ కుమార్ ​ఆరోపించారు. భూములపైన అవగాహన లేని ఐఏఎస్​ అధికారులకు కీలక బాధ్యతలను కట్టబెట్టారన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటనను జారీ చేశారు. ధరణి పోర్టల్​ అమల్లోకి వచ్చి 14 నెలలు గడుస్తోన్న ప్రభుత్వ, ప్రైవేటు భూములను విభజించలేకపోయారని మండిపడ్డారు. మొత్తం భూములను […]

Update: 2021-11-15 07:29 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: భూముల సమస్యలను గుర్తించకుండా గుడ్డిగా ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చారని, సామర్ధ్యం లేని సాఫ్ట్​వేర్ కంపెనీకి బాధ్యతలు అప్పగించారని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ కుమార్ ​ఆరోపించారు. భూములపైన అవగాహన లేని ఐఏఎస్​ అధికారులకు కీలక బాధ్యతలను కట్టబెట్టారన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటనను జారీ చేశారు. ధరణి పోర్టల్​ అమల్లోకి వచ్చి 14 నెలలు గడుస్తోన్న ప్రభుత్వ, ప్రైవేటు భూములను విభజించలేకపోయారని మండిపడ్డారు. మొత్తం భూములను బ్లాక్​చేస్తూ లక్షలాది మంది రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.

శ్రీ పేరిట మూడు లక్షల ఎకరాల భూమిని ధరణిలో నమోదైందని, ఆ భూములను ఎవరికి కట్టబెడతారని ప్రశ్నించారు. కొన్ని సర్వే నంబర్లలో ఎక్కువ, తక్కువ విస్తీర్ణం నమోదైందని, ఈ సమస్యను పరిష్కరించే మెకానిజం అధికారుల దగ్గర లేదన్నారు. లక్షలాది మంది రైతులను బాధ పెట్టిన ధరణి పోర్టల్ మొదటి బర్త్ డేకు అధికారులు కేకులు కట్ చేసి పైచాచిక ఆనందం పొందటం ఏమిటన్నారు. ఈ సంప్రదాయం ఎక్కడైనా ఉందా అని నిలదీశారు.

నాలా కన్వర్షన్ కాని భూమిని కూడా వ్యవసాయేతరం కింద చూపించడం వల్ల రైతులకు సంక్షేమ ఫలాలు అందడం లేదన్నారు. వివిధ కారణాల వల్ల ప్రభుత్వం నుంచి పట్టా పాస్​బుక్స్, సర్వ హక్కులు ఉన్నా వారి వారసులకు మార్చుకునే అవకాశం ధరణి పోర్టల్‌లో లేదన్నారు. ధరణిలో పది లక్షల స్లాట్లు బుక్ అయ్యాయని, ఆదాయం వచ్చిందని గొప్పలు చెబుతున్నారన్నారు. ఇకనైనా సమగ్ర భూ సర్వేను నిర్వహించిన సమస్యల్లేని రికార్డులను రూపొందించాలని నారగోని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News