తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీకే‌సింగ్ రాజీనామా

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎస్ డీజీ వీకే సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్న వీకే‌సింగ్ బుధవారం హోంశాఖ మంత్రికి రాజీనామా లేఖ పంపారు. గాంధీ జయంతి అక్టోబర్ 2న ఫ్రీ రిటైర్మెంట్ ఇవ్వాలని కోరారు. కొంతకాలంగా ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న వీకేసింగ్, ఐపీఎస్‌గా కొనసాగడానికి తనకు ఇష్టం లేదని లేఖలో పేర్కొన్నారు. ప్రజలకు ఇతర రూపంలో సేవ చేస్తానని వీకే సింగ్ లేఖలో స్పష్టం చేశారు. పోలీస్‌శాఖలో […]

Update: 2020-06-24 10:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎస్ డీజీ వీకే సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్న వీకే‌సింగ్ బుధవారం హోంశాఖ మంత్రికి రాజీనామా లేఖ పంపారు. గాంధీ జయంతి అక్టోబర్ 2న ఫ్రీ రిటైర్మెంట్ ఇవ్వాలని కోరారు. కొంతకాలంగా ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న వీకేసింగ్, ఐపీఎస్‌గా కొనసాగడానికి తనకు ఇష్టం లేదని లేఖలో పేర్కొన్నారు. ప్రజలకు ఇతర రూపంలో సేవ చేస్తానని వీకే సింగ్ లేఖలో స్పష్టం చేశారు.

పోలీస్‌శాఖలో ఎన్నో సంస్కరణలు తేవాలన్న ఆశయం ఉండేదన్న వీకేసింగ్, వాటి అమల్లో సఫలం కాలేకపోయానని పేర్కొన్నారు. తన సర్వీస్ పట్ల ప్రభుత్వం కూడా సంతృప్తిగా లేనట్లుందని, అందుకే ప్రభుత్వానికి భారం కావొద్దని రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. నేను ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, నా సేవలు ప్రభుత్వంలో కంటే బయటే అవసరం అని వీకే‌సింగ్ లేఖలో తెలిపారు.

Tags:    

Similar News