ఆన్లైన్ ఆడిటింగ్ లో మనమే నెంబర్ వన్.. అభినందిస్తూ కేంద్రం లేఖ..
దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామ పంచాయతీల ఆన్లైన్ ఆడిటింగ్ లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచింది. మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ను అభినందిస్తూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ జాయింట్ సెక్రెటరీ సేథీ గురువారం లేఖ పంపారు. దేశంలో ఆన్లైన్ ఆడిటింగ్ లో తెలంగాణ రాష్ట్రం మిగతా రాష్ట్రాలకు లీడ్ రోల్ పోషిస్తున్నట్లు అభినందించారు. కేంద్ర ఆర్థిక సంఘం ద్వారా స్థానిక […]
దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామ పంచాయతీల ఆన్లైన్ ఆడిటింగ్ లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచింది. మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ను అభినందిస్తూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ జాయింట్ సెక్రెటరీ సేథీ గురువారం లేఖ పంపారు. దేశంలో ఆన్లైన్ ఆడిటింగ్ లో తెలంగాణ రాష్ట్రం మిగతా రాష్ట్రాలకు లీడ్ రోల్ పోషిస్తున్నట్లు అభినందించారు.
కేంద్ర ఆర్థిక సంఘం ద్వారా స్థానిక సంస్థలకు కేటాయిస్తున్న నిధుల వినియోగంపై ఎప్పటికప్పుడు ఆడిటింగ్ నిర్వహిస్తున్నది. 2020-21 వ సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం నిధులు వినియోగం విషయమై ఆన్లైన్ ఆడిటింగ్ నిర్వహిస్తూ అందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ జారీ చేసింది. వాటికనుగుణంగా ఆయా రాష్ట్రాల్లోని స్థానిక సంస్థలు తాము చేసిన నిధుల ఖర్చును ఆన్లైన్ లోనే అందిస్తున్నది. నిర్ణీత గడువు కంటే ముందే వందకు వంద శాతం ఆన్లైన్ ఆడిటింగ్ పూర్తిచేసిన తెలంగాణ, దేశంలో నెంబర్ వన్ గా నిలిచింది.
ఆ తర్వాతి స్థానాల్లో 72 శాతం తో తమిళనాడు, 60 శాతం తో ఆంధ్రప్రదేశ్, 59శాతం తో కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. కాగా 2019-20 సంవత్సరానికి 14వ ఆర్థిక సంఘం నిధులు వినియోగం పై నిర్వహించిన ఆన్లైన్ ఆడిటింగ్ లో కూడా తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా నిలవడం విశేషం. ఆడిటింగ్ లో రాష్ట్రం ప్రథమస్థానంలో నిలిచేందుకు కృషి చేసిన పంచాయతీరాజ్ సిబ్బందిని మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు.