ఇంటర్ ఫలితాలు రిలీజ్.. బాలికలదే పైచేయి

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం మధ్యాహ్నం 3గంటలకు ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి మంత్రి సబితా ఇంద్రారెడ్డి రిలీజ్ చేశారు. మొత్తం 9లక్షల 65వేల 839 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో ఫస్టియర్ విద్యార్థులు 4 లక్షల 80వేల 516 కాగా, సెకండియర్ విద్యార్థులు 4లక్షల 85వేల 323 మంది ఉన్నారు. ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారు. ఉత్తీర్ణతలో మొదటి స్థానం కొముర భీం జిల్లా కాగా, మేడ్చల్ జిల్లా […]

Update: 2020-06-18 04:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం మధ్యాహ్నం 3గంటలకు ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి మంత్రి సబితా ఇంద్రారెడ్డి రిలీజ్ చేశారు. మొత్తం 9లక్షల 65వేల 839 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో ఫస్టియర్ విద్యార్థులు 4 లక్షల 80వేల 516 కాగా, సెకండియర్ విద్యార్థులు 4లక్షల 85వేల 323 మంది ఉన్నారు. ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారు. ఉత్తీర్ణతలో మొదటి స్థానం కొముర భీం జిల్లా కాగా, మేడ్చల్ జిల్లా సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. ఫస్టియర్‌లో మొత్తం 60.01శాతం, సెకండియర్‌లో 68.86శాతం ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణ ఏర్పడితన తర్వాత ఇంత ఉత్తీర్ణత శాతం నమోదు కావడం ఇదే తొలిసారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. లాస్ట్ ఇయర్ ఎదురైన ఇబ్బందుల దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకొని పరీక్షలు నిర్వహించామని, విద్యార్థుల మార్కుల లిస్ట్‌ను ఒకటికి రెండుసార్లు చెక్ చేశామని మంత్రి పేర్కొన్నారు.

Tags:    

Similar News