రేపు ఇంటర్ రీ-వెరిఫికేషన్ ఫలితాలు
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతుండటంతో రాష్ట్రంలో జరగాల్సిన పరిక్షలన్నీ వాయిదా పడగా, కొన్ని పరీక్షలు నిర్వహించకుండానే అందరినీ పాస్ చేస్తూ, ఫలితాలు వెల్లడించారు. అయితే రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావానికి ముందే నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అయితే పరీక్షల రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్ ఫలితాలు బుధవారం విడుదల చేస్తున్నట్టు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. రేపటి నుంచి ఇంటర్ బోర్డు అధికారిక […]
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతుండటంతో రాష్ట్రంలో జరగాల్సిన పరిక్షలన్నీ వాయిదా పడగా, కొన్ని పరీక్షలు నిర్వహించకుండానే అందరినీ పాస్ చేస్తూ, ఫలితాలు వెల్లడించారు. అయితే రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావానికి ముందే నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అయితే పరీక్షల రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్ ఫలితాలు బుధవారం విడుదల చేస్తున్నట్టు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. రేపటి నుంచి ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ http//tsbie.cgg.gov.in ద్వారా సవరించిన మార్కులు, స్కాన్ చేసిన జవాబు స్క్రిప్టులు డౌన్‌లోడ్ చేసుకోచ్చని సూచించింది. మొత్తం 37,387 మంది విద్యార్థులు 72,496 సబ్జెక్టుల్లో రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది. అయితే ఇప్పటివరకూ 71,298 జవాబు స్క్రిప్టులే తిరిగి ధ్రువీకరించామని, మిగతా 1,198 జవాబు స్క్రిప్టులు నెలాఖరుకి పూర్తవుతాయని తెలిపింది. సవరించిన మెమోలను ఆగస్టు 1 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ప్రకటనలో ఇంటర్‌బోర్డు సూచించింది.