అవతరణ ఉత్సవాలు జెండావిష్కరణకే పరిమితం

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్ర అవతరణ ఉత్సవాలు ఈ సంవత్సరం నిరాడంబరంగానే జరగనున్నాయి. ప్రతీ ఏటా ప్రభుత్వం ఈ ఉత్సవాలను ఘనంగా పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించేది. ఈసారి మాత్రం కరోనా లాక్‌డౌన్ ఆంక్షల కారణంగా ఆర్భాటం లేకుండా జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఉదయం 8.40 గంటలకు అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపానికి నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్ళి జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. ప్రధాన కార్యదర్శి, డీజీపీ ఆయనకు అక్కడ స్వాగతం పలుకుతారు. […]

Update: 2020-06-01 10:09 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్ర అవతరణ ఉత్సవాలు ఈ సంవత్సరం నిరాడంబరంగానే జరగనున్నాయి. ప్రతీ ఏటా ప్రభుత్వం ఈ ఉత్సవాలను ఘనంగా పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించేది. ఈసారి మాత్రం కరోనా లాక్‌డౌన్ ఆంక్షల కారణంగా ఆర్భాటం లేకుండా జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఉదయం 8.40 గంటలకు అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపానికి నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్ళి జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. ప్రధాన కార్యదర్శి, డీజీపీ ఆయనకు అక్కడ స్వాగతం పలుకుతారు. అనంతరం ఆహ్వానితులకు తేనీటి విందు ఉంటుంది. అయితే రాష్ట్ర అవతరణ ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగం ఉండదు. రాష్ట్రం ఏర్పడిన ఆరేళ్ళలో ప్రసంగం లేకపోవడం ఇదే తొలిసారి అవుతుంది. ప్రతీ అవతరణ ఉత్సవం సందర్భంగా ఏదో ఒక హామీ లేదా కొత్త పథకాన్ని ప్రకటించడం ఆనవాయితీ. ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రసంగం ద్వారా ప్రజలకు తెలియజేయడం ఒక సంప్రదాయంగానే కొనసాగింది. అయితే ఈసారి సోషల్ డిస్టెన్స్, సామూహిక కార్యక్రమాలు జరగడానికి ఆంక్షలు కొనసాగుతున్నందున నిరాడంబరంగానే జరుగుతోంది.

మరోవైపు ప్రభుత్వ సిబ్బంది విధిగా ఈ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి సర్క్యులర్ జారీ చేశారు. తాత్కాలిక సచివాలయమైన బూర్గుల రామకృష్ణారావు భవన్‌లోని 10వ అంతస్తులో ఉదయం 8.00 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరణ ఉంటుందని, ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి ఉద్యోగులు తప్పనిసరిగా హాజరుకావాల్సిందేనని, లేనిపక్షంలో ఆయా విభాగాధిపతులు ప్రధాన కార్యదర్శికి తగిన కారణాలను ప్రస్తావిస్తూ వివరణ లేఖ ఇవ్వాలని జీఏడీ ముఖ్య కార్యదర్శి ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకాకుండా ఉన్న ఉద్యోగుల వివరాలను ఆ విభాగాధిపతులు ప్రధాన కార్యదర్శికి సమర్పించాలని సూచించారు.

Tags:    

Similar News