థర్డ్ వేవ్‌పై తెలంగాణ హెల్త్ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: థర్డ్ వేవ్‌పై తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. థర్డ్ వేవ్ ముప్పుపై ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. తెలంగాణలో కరోనా ప్రభావం తగ్గిందని, అయినా ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరాయంగా జరుగుతుందని, హైదరాబాద్‌లో 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ వేస్తున్నామని శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటి వరకు తెలంగాణలో 1.20 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చామని, ఈ నెల 15 నుంచి ఆగస్టు […]
దిశ, వెబ్‌డెస్క్: థర్డ్ వేవ్‌పై తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. థర్డ్ వేవ్ ముప్పుపై ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. తెలంగాణలో కరోనా ప్రభావం తగ్గిందని, అయినా ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరాయంగా జరుగుతుందని, హైదరాబాద్‌లో 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ వేస్తున్నామని శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటి వరకు తెలంగాణలో 1.20 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చామని, ఈ నెల 15 నుంచి ఆగస్టు 15 వరకు దాదాపు 30 లక్షల మందికి పైగా రెండో డోస్ తీసుకునేవారు ఉన్నారని శ్రీనివాసరావు తెలిపారు. గత రెండేళ్లలో సీజనల్ వ్యాధులు కూడా తగ్గాయన్నారు.