కేంద్రం మీద తెలంగాణ ఆగ్రహం.. ఎందుకు ?
దిశ, న్యూస్ బ్యూరో: జల వివాదాల అంశంలో కేంద్రం తమ మీద కర్ర పెత్తనం చేస్తోందని తెలుగు రాష్ట్రాలు అసహనంగా ఉన్నాయి. రాజకీయ కోణంలోనే కేంద్ర మంత్రి షెకావత్ లేఖ రాశారని భావిస్తున్నాయి. ఇది రాజకీయ డ్రామా కావచ్చనీ సందేహిస్తున్నాయి. కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రుల దగ్గరకు ఈ విషయాన్ని ప్రస్తావించుకుంటూనే తిరుగుతున్నానే సమాచారం సీఎం కేసీఆర్‌కు అందింది. అందుకే దీని మీద అమీతుమీ తేల్చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రాజెక్టుల […]
దిశ, న్యూస్ బ్యూరో: జల వివాదాల అంశంలో కేంద్రం తమ మీద కర్ర పెత్తనం చేస్తోందని తెలుగు రాష్ట్రాలు అసహనంగా ఉన్నాయి. రాజకీయ కోణంలోనే కేంద్ర మంత్రి షెకావత్ లేఖ రాశారని భావిస్తున్నాయి. ఇది రాజకీయ డ్రామా కావచ్చనీ సందేహిస్తున్నాయి. కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రుల దగ్గరకు ఈ విషయాన్ని ప్రస్తావించుకుంటూనే తిరుగుతున్నానే సమాచారం సీఎం కేసీఆర్‌కు అందింది. అందుకే దీని మీద అమీతుమీ తేల్చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ప్రాజెక్టుల డీపీఆర్లు ఇచ్చి తీరాలని, నిర్మాణాలు ఆపాలని కేంద్రం తెలుగు రాష్ట్రాలకు ఇటీవల లేఖ రాసింది. దీని మీద స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేందుకు తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తోంది. కేంద్రా నికి చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా చూసేందుకు నీటిపారుదల శాఖ నిపుణులతో చర్యలు మొదలు పెట్టింది. జల వివాదాల అంశంలో తెలుగు రాష్ట్రాలను ఇరుకున పెట్టాలని, పెత్తనం చెలా యించాలనే ఉద్దేశ్యంతోనే కేంద్రం ఈ ప్రాజెక్టులపై గురి పెట్టిందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. పరిష్కార మార్గాలను చూపకుండా ప్రాజెక్టులను ఆపాలనడం సరికాదనే అంటున్నారు.
తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టుల్లో కేంద్ర ఆర్థిక సాయం రూపాయి కూడా లేదు. ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వానికి కలిసి వస్తోంది. ఇంటర్ స్టేట్స్ ఇబ్బందులున్న ప్రాజెక్టులు, తాము నిధు లు ఇచ్చిన ప్రాజెక్టులపై కల్పించుకునేందుకు కేంద్రానికి అవకాశాలు ఉంటాయి. బచావత్ ట్రిబ్యునల్ సూచనల ప్రకారం రాష్ట్రాలు నిర్మించుకునే ప్రాజెక్టుల్లో కేంద్రం జోక్యం అవసరం లేదు. రాష్ట్రం లో సాగు, తాగునీటి అవసరాలను పరిగణలోకి తీసుకుని ప్రాజెక్టులను నిర్మించుకునే వెసలుబాటు ఉంది. ‘కాళేశ్వరం’ను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం దీనికి దరఖాస్తు కూడా చేసుకోలేదు.
రాయలసీమపై ఏం చేశారు?
ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం లేఖ రాయడంపై రాష్ట్ర ప్రభుత్వం గుర్రుగా ఉంది. కేంద్రం కల్పించుకోవాల్సిన అవసరం ఏముందనే భావనతో ఉంది. రాయలసీమ ప్రాజెక్టు అంశంలో ఏమీ తేల్చకుం డా, మిగతా ప్రాజెక్టులను అపాలని ఎందుకు అంటున్నారని కేంద్రాన్ని ప్రశ్నించనుంది. శ్రీశైలం ప్రాజెక్టు, కృష్ణా నదిలోని సంగమేశ్వరం పాయింట్ దగ్గర ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల మీద బోర్డుకు ఫిర్యాదు చేశామని తెలంగాణ పేర్కొంటోంది. తమ నీటి ప్రయోజనాలకు ఇబ్బందులు ఎదురవుతాయనే ఫిర్యాదు చేశామని, దీనిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా తెలంగాణలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను ఎలా అపమంటారని, డీపీఆర్‌లు ఎందుకు ఇవ్వాలని కేంద్రాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమవుతోంది. 2016లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ తొలి సమావేశం లో చర్చించిన అంశాలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. చాలా అంశాలు పెండింగ్‌లోనే ఉన్నాయి.
ఇవన్నీ ఆన్ గోయింగ్ ప్రాజెక్టులే!
రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులేవీ నిర్మించడం లేదని, అన్నీ ఆన్ గోయింగ్ ప్రాజెక్టులేనని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి వివరించనున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. పాత ప్రాజె క్టులను రీడిజైనింగ్ చేసి నిర్మించుకునేటపుడు కేంద్రానికి వివరాలు చెప్పాల్సిన అవసరమే లేదని అంటున్నారు. ఇదే అంశంపై తెలంగాణ ప్రభుత్వం వాదించేందుకు అవకాశాలున్నాయని పేర్కొం టున్నారు. కృష్ణా, గోదావరి బేసిన్‌లో ప్రాజెక్టులు నిర్మించిన కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించడం లేదో చెప్పాలని అడగాలనుకుంటున్నారు. ఆల్మట్టి ఎత్తు పెరుగుతుంటే అభ్యంతరాలు చెప్పడం లేదు. ట్రిబ్యునల్ -1లో రాష్ట్రాలకు కొన్ని హక్కులు కల్పించారని, దాని ప్రకారం ఇతర రాష్ట్రాలతో లింక్ అయి, ఇంటర్ స్టేట్స్ అభ్యంతరాలు ఉండి, కేంద్రం నిధులు వెచ్చించాల్సిన ప్రాజెక్టు ల కోసమే కేంద్రం దగ్గరకు రావాలని స్పష్టంగా ఉంది. కాళేశ్వరంతో పాటు భక్త రామదాసు, సీతారామ, డిండి, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులన్నీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినవే. కాళే శ్వరం ప్రాజెక్టుకు మహారాష్ట్రతో అన్ని ఒప్పందాలు పూర్తి అయ్యాయి. ఇలాంటి సమయంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులపై కేంద్రం ప్రశ్నించాల్సిన అవసరమే లేదని నీటిపారుదల శాఖ నిపుణులు, న్యాయ నిపుణులు రాష్ట్ర ప్రభుత్వానికి వెల్లడించారు.