పోడు రైతుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న సర్కార్ : ఇక్బాల్ హుస్సేన్
దిశ, మణుగూరు : తెలంగాణ సీఎం కేసీఆర్ పోడు భూములకు పట్టాలు ఇస్తానని చెప్పి పోడు రైతులను దారుణంగా మోసం చేస్తున్నారని కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ అన్నారు. ఆదివారం ఇక్బాల్ హుస్సేన్ ఆయన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పోడు భూములకు పట్టాలు ఇస్తానని చెప్పి రైతులను మభ్యపెట్టి వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడని మండిపడ్డారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం […]
దిశ, మణుగూరు : తెలంగాణ సీఎం కేసీఆర్ పోడు భూములకు పట్టాలు ఇస్తానని చెప్పి పోడు రైతులను దారుణంగా మోసం చేస్తున్నారని కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ అన్నారు. ఆదివారం ఇక్బాల్ హుస్సేన్ ఆయన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పోడు భూములకు పట్టాలు ఇస్తానని చెప్పి రైతులను మభ్యపెట్టి వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడని మండిపడ్డారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలో పోడు రైతులు భూముల కోసం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం చాలా బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ పోడు భూములకు పట్టాలు ఇస్తావా.. ఇయ్యవా.. చెప్పాలని డిమాండ్ చేశారు. పోడు భూములకోసం ఇంకా ఎంతమంది పోడు రైతులు ఆత్మహత్యలు చేసుకునేలా చేస్తావ్ అని నిలదీశారు. పోడు భూముల రైతుల ఉసురు కేసీఆర్‌కి తగులుతుందని అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాక్షస పరిపాలన కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రజలకు ఇచ్చే హామీలన్నీ గాలిలో దీపంలాంటివని అన్నారు. హుజురాబాద్‌లో దళితులకు దళితబంధు అని కొత్త తెరలేపరన్నారు.
దళితులకు మూడు ఎకరాల భూమి ఎక్కడ ఇచ్చావ్ అని ప్రశ్నించారు. ఇలా లేనిపోని పథకాలు, హామీలతో దళితులను నమ్మించి.. హుజురాబాద్‌లో ఓట్లు కోసమే టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోందని తెలిపారు. అయితే, ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఏంటో తెలిసిపోయిందని, త్వరలో హుజురాబాద్‌లో జరిగే ఎన్నికల్లో దళితులే టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ది చెప్పుతారని వివరించారు.
పోడుభూముల రైతుల సమస్యలను స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఎన్నో సార్లు పోడు రైతులు రేగాను కలిసి తమబాధలు చెప్పుకున్నా ఆయనకు కొంచెం కూడా చలనం లేదని వివరించారు. కాంగ్రెస్ ఓట్లతో గెలిచావ్.. పినపాక నియోజకవర్గ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ కండువా కప్పుకున్నావ్.. అభివృద్ధి ఎక్కడ చేశారని ఈ సందర్భంగా ప్రశ్నించారు.
ఇప్పటికైనా ఎమ్మెల్యే రేగా పినపాక నియోజకవర్గ పోడు రైతుల సమస్యలను, పోడు భూముల పట్టాల విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి నియోజకవర్గ పోడు రైతులకు న్యాయం చేయాలని కోరారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు పోడు రైతులతో కలిసి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ధర్నాలు,
రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగబండి వెంకటేశ్వర్లు, యూత్ మండల అధ్యక్షుడు పోనుసోత్ సాగర్, మహిళ మండల అధ్యక్షురాలు చందా వెంకట రత్తమ్మ, తదితరులు పాల్గొన్నారు.