తెలంగాణ కరోనా హెల్త్ బులెటిన్ రిలీజ్..

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో పకడ్భందీగా లాక్‌డౌన్ అమలు చేస్తుండటం వలన కరోనా వ్యాప్తి అదుపులోకి వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,493 కేసులు వెలుగుచూడగా, 15 మంది చికిత్స పొందుతూ మృతి చెందారు. కొవిడ్ బారి నుంచి కోలుకుని కొత్తగా 3,308 మంది రికవరీ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో 33,254 యాక్టివ్ కేసులుండగా, ఇప్పటివరకు […]

Update: 2021-06-01 09:14 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో పకడ్భందీగా లాక్‌డౌన్ అమలు చేస్తుండటం వలన కరోనా వ్యాప్తి అదుపులోకి వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,493 కేసులు వెలుగుచూడగా, 15 మంది చికిత్స పొందుతూ మృతి చెందారు.

కొవిడ్ బారి నుంచి కోలుకుని కొత్తగా 3,308 మంది రికవరీ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో 33,254 యాక్టివ్ కేసులుండగా, ఇప్పటివరకు మొత్తంగా 3,296 మంది మృతిచెందినట్లు హెల్త్ బులెటిన్ పేర్కొంది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 308 కేసులు వెలుగుచూసినట్లు సమాచారం.

Tags:    

Similar News