హైదరాబాద్ గ్రిడ్ పాలసీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో కొత్తగా వచ్చే పరిశ్రమల్లో స్థానికులకే ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు కల్పించేలా రాష్ట్ర పరిశ్రమల శాఖ రూపొందించిన ముసాయిదాకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తెలంగాణ యువకులకు ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలకు ప్రభుత్వం తరఫున అదనపు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో బుధవారం సాయంత్రం జరిగిన మంత్రివర్గం సమావేశం నిర్ణయం తీసుకుంది. నగరంలో ప్రస్తుతం ఒకేవైపున ఉన్న ఐటీ పరిశ్రమలను ఇకపైన నాలుగు దిక్కులా విస్తరించే విధంగా రూపొందించిన హైదరాబాద్ గ్రిడ్ […]

Update: 2020-08-05 12:19 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో కొత్తగా వచ్చే పరిశ్రమల్లో స్థానికులకే ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు కల్పించేలా రాష్ట్ర పరిశ్రమల శాఖ రూపొందించిన ముసాయిదాకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తెలంగాణ యువకులకు ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలకు ప్రభుత్వం తరఫున అదనపు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో బుధవారం సాయంత్రం జరిగిన మంత్రివర్గం సమావేశం నిర్ణయం తీసుకుంది. నగరంలో ప్రస్తుతం ఒకేవైపున ఉన్న ఐటీ పరిశ్రమలను ఇకపైన నాలుగు దిక్కులా విస్తరించే విధంగా రూపొందించిన హైదరాబాద్ గ్రిడ్ పాలసీని కేబినెట్ ఆమోదించింది. హైదరాబాద్ పశ్చిన ప్రాంతం మినహా మిగిలిన దిక్కుల్లో ఐటీ కంపెనీలు పెడితే ప్రభుత్వం తరపున అదనపు ప్రోత్సాహకాలు లభించనున్నాయి.

నగరంలో పెరిగిపోతున్న వాహనాల వలన వెలువడే కాలుష్యాన్ని నివారించడానికి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచే విధంగా రూపొందిన తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిక్ వెహికిల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్ పాలసీని కేబినెట్ ఆమోదించింది. ఈ పాలసీ వలన వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి వీలు కలుగుతుందని, రాష్ర్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరుగుతుందని, దీన్ని ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఈ పాలసీని రూపొందించినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమను ప్రోత్సహించాలని నిర్ణయించడంతో పాటు అలాంటి పరిశ్రమలకు ప్రభుత్వం తరఫున ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని నిర్ణయం జరిగింది.

రాష్ట్ర ప్రభుత్వం గతంలో రూపొందించిన టీఎస్-ఐపాస్ పాలసీ కారణంగా కొత్త పారిశ్రామిక అనుమతుల విధానం ఉనికిలోకి రావడం, ఈ కారణంగా భారీ సంఖ్యలో పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయని, ఫలితంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని, దీన్ని దృష్టిలో పెట్టుకుని స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా నూతన పాలసీని రూపొందించినట్లు ప్రభుత్వం ఆ ప్రకటనలో తెలిపింది. తెలంగాణ యువకులకే ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా ముసాయిదా విధానాన్ని రూపొందించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించడంతో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో సుదీర్ఘ కసరత్తు అనంతరం ముసాయిదా తయారైందని, దీన్ని మంత్రివర్గం లోతుగా చర్చించి ఆమోదం తెలిపిందని పేర్కొంది.

Tags:    

Similar News