లేట్‌నైట్ స్లీపింగ్, నిద్రలేమితో.. 'ఆస్తమా' రిస్క్
దిశ, వెబ్‌డెస్క్ : నేటి స్మార్ట్ యుగంలో ఎంతోమంది నిద్రకు దూరమవుతున్నారు. సెల్‌ఫోన్ కౌగిట్లో, కంప్యూటర్ తెరలపై.. అర్ధరాత్రులన్నీ తెల్లారిపోతున్నాయి. ఉదయాలన్నీ రాత్రుళ్లుగా, చీకట్లన్నీ వెలుగు తెరలుగా.. మారిపోయాయి. ఇలా మన జీవనశైలిలో వస్తున్న మార్పులు అనేక అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు కూడా మానవ తప్పిదాలే కారణం. కంటి నిండా నిద్ర.. ఎన్నో రోగాలను దూరం చేస్తుందనేది పాత మాటే అయినా వాస్తవం కూడా. నిద్రలేమి వల్ల ఆస్తమా, అలర్జీలు వచ్చే […]
దిశ, వెబ్‌డెస్క్ : నేటి స్మార్ట్ యుగంలో ఎంతోమంది నిద్రకు దూరమవుతున్నారు. సెల్‌ఫోన్ కౌగిట్లో, కంప్యూటర్ తెరలపై.. అర్ధరాత్రులన్నీ తెల్లారిపోతున్నాయి. ఉదయాలన్నీ రాత్రుళ్లుగా, చీకట్లన్నీ వెలుగు తెరలుగా.. మారిపోయాయి. ఇలా మన జీవనశైలిలో వస్తున్న మార్పులు అనేక అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు కూడా మానవ తప్పిదాలే కారణం. కంటి నిండా నిద్ర.. ఎన్నో రోగాలను దూరం చేస్తుందనేది పాత మాటే అయినా వాస్తవం కూడా. నిద్రలేమి వల్ల ఆస్తమా, అలర్జీలు వచ్చే అవకాశం ఎక్కువని తాజా అధ్యయనంలోనూ వెల్లడి కావడమే అందుకు నిదర్శనం.
మొన్నటి తరం వరకు.. ‘ఎర్లీ టూ బెడ్, ఎర్లీ టూ వేకప్’ సూత్రాన్నే పాటించేవారు. కానీ మారుతున్న లైఫ్‌స్టైల్ కారణంగా, రాత్రి పడుకునే వేళలు కూడా మారిపోతున్నాయి. షిఫ్ట్ డ్యూటీలు, సెల్ ఫోన్ అలవాటు, టీవీలోని కార్యక్రమాలు, తెల్లవార్లూ ఓపెన్‌గా ఉండే షాపులు.. ఇలా నైట్‌ను కాస్త, డేగా మార్చేశాయి. ఈ కారణాల వల్ల లేట్‌నైట్‌లో పడుకుని.. డే టైమ్ లేటుగా లేచే వారి సంఖ్య పెరుగుతోంది. శరీరానికి ఎండ తగలక పోవడం, జీవక్రియలన్నీ తారుమారు కావడంతో అనారోగ్యాలు దరిచేరుతున్నాయి. క్రానిక్ అలర్జీలు, ఇన్‌ఫెక్షన్స్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, ఆస్తమా వంటి వ్యాధులు వస్తున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. 1684 మంది టీనేజర్లపై ఈ అధ్యయనాన్ని చేపట్టారు.
స్లీపింగ్ హ్యాబిట్స్, ఏ టైమ్‌లో అలసటగా అనిపిస్తుంది? వాతావరణ మార్పులకు ఎలా స్పందిస్తారు, ఆరోగ్యం ఎలా ఉంటుంది? జలుబు, తలనొప్పి వంటి సమస్యలు ఎప్పుడెప్పుడు వస్తాయి? తదితర ప్రశ్నల ఆధారంగా టీనేజర్ల ఆరోగ్యంపై ఓ అంచనాకు వచ్చారు. అంతేకాదు ఫ్యామిలీ హిస్టరీ కూడా అడిగి తెలుసుకున్నారు. స్మోకింగ్ హ్యాబిట్స్‌పై ఆరా తీశారు. ఇలా అన్ని కోణాల్లోనూ టీనేజర్లపై పరిశోధన సాగింది. మంచి నిద్రపోవడంతో పాటు ఎర్లీ అవర్స్‌లో పడుకునేవాళ్లలో ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించలేదు. కానీ నిద్రలేమి, లేట్ నైట్ పడుకునేవాళ్లలో మాత్రం ఆస్తమా, ఎలర్జీలు వచ్చే ముప్పు మూడు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది.
నిద్రలేమి, లేట్ నైట్ నిద్ర వల్ల ‘మెలాటోనిన్’ అనే హార్మోన్ పనితీరు దెబ్బతింటుంది. అది శరీరంపై అనేక రియాక్షన్స్ చూపిస్తుంది. దాని వల్లే మూడ్ ప్రాబ్లెమ్స్, టైర్డ్‌నెస్, అలర్జీస్, వెయిట్ గెయిన్ వంటి సమస్యలు వస్తున్నట్లు తెలిసింది.
మరేం చేయాలి?
– 7-8 గంటల నిద్ర పోవాలి. రోజూ ఒకే సమయానికి నిద్రించడం అలవాటుగా చేసుకోవాలి
– గదిలో వెంటిలేషన్ ధారాళంగా ఉండాలి. మాట్రస్, బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ వంటివి శుభ్రంగా ఉంచుకోవాలి. గదిని ఎప్పటికప్పుడు నీట్‌గా ఉంచుకోవాలి.
– ప్రాపర్ స్లీప్ పొజిషన్ ఉండాలి. బ్రీతింగ్ ఈజీగా తీసుకునేలా పడుకోవాలి
– పడుకునే మూడు గంటల ముందు స్క్రీన్ (సెల్‌ఫోన్, టీవీ, ల్యాపీ, డెస్క్ టాప్)కు దూరంగా ఉండాలి.