బిగ్ షాక్.. త్వరలో ఈ స్మార్ట్‌ఫోన్‌లలో ఆగిపోనున్న వాట్సాప్ !

వాట్సాప్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. ప్రతి ఒక్కరూ ఈరోజుల్లో వాట్సాప్ యూస్ చేస్తున్నారు. చాటింగ్ చేసుకోవడానికి, డాక్యుమెంట్స్ షేర్ చేసుకోవడం వాట్సాప్ ద్వారా చాలా ఈజీ. అంతే కాకుండా చాలా వరకు ఆఫీసు

Update: 2024-07-04 09:38 GMT

దిశ, ఫీచర్స్ : వాట్సాప్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. ప్రతి ఒక్కరూ ఈరోజుల్లో వాట్సాప్ యూస్ చేస్తున్నారు. చాటింగ్ చేసుకోవడానికి, డాక్యుమెంట్స్ షేర్ చేసుకోవడం వాట్సాప్ ద్వారా చాలా ఈజీ. అంతే కాకుండా చాలా వరకు ఆఫీసు పనులు కూడా వాట్సాప్ ద్వారానే జరుగుతున్నాయి. అందుకే ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడటానికే ఎక్కు ఆసక్తి చూపుతున్నారు. దీంతో వినియోగదారును ఆకర్షించడానికి, వారి భద్రతను దృష్టిలో పెట్టుకిని వాట్సాప్ కూడా కొత్త కొత్ ఫీచర్స్‌ను తీసుకొస్తుంది. అయితే తాజాగా వాట్సాప్ సరికొత్త ఫీచర్‌తో ముందుకు వచ్చింది. పాత సెక్యూరిటీ ఫీచర్లకు అప్డేట్‌గా దీనిని తీసుకొచ్చింది. అయితే కొన్ని స్మార్ట్ ఫోన్స్‌లలో ఈ ఫీచర్ అప్డేట్ కావడం లేదు. దీంతో అందులో వాట్సాప్ పని చేయదు అంటున్నారు కొందరు.

ఈ అప్డేట్ వలన కొన్నిరకాల స్మార్ట్ ఫోన్‌లలో ఇక నుంచి వాట్సాప్ పని చేయదు. కాగా, ఏ ఏ స్మార్ట్ ఫోన్‌లలో వాట్సాప్ అప్డేట్ కాదో ఇప్పుడు చూద్దాం. కెనాల్ టెక్ నివేదిక ప్రకారం.. మోటో,ఆపిల్,సోనీ, ఎల్‌జీ,సామాంసంగ్, సహా కొన్ని బ్రాండ్‌లకు చెందిన 35 స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్ సపోర్ట్ నిలిపివేసినట్లు సమాచారం. సామ్ సాంగ్ గెలాక్సీ ఏసీఈ ప్లస్, సామ్ సాంగ్ గెలాక్సీ నోట్ 3, మోటో, ఐఫోన్ సిక్స్, ఆండ్రాయిడ్ 5.0 వెర్షన్ ఫోన్స్, ఆపిల్ ఐఫోన్ ఐఓఎస్ 12 వెర్షన్ వంటి ఫోన్‌లలో వాట్సాప్ అప్డేట్ కానందు వలన ఈ ఫోన్ యూస్ చేస్తున్నవారు, అప్‌డేట్ స్మాట్ ఫోన్‌కి మారాల్సిందేనంట.


Similar News