WhatsApp వీడియో కాల్స్‌ మాట్లాడుతున్నారా.. వెలుగులోకి కొత్త స్కామ్

మెసేజింగ్ దిగ్గజ యాప్ వాట్సాప్ ఇటీవల కాలంలో వరుసగా కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది.

Update: 2023-09-20 12:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: మెసేజింగ్ దిగ్గజ యాప్ వాట్సాప్ ఇటీవల కాలంలో వరుసగా కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. చాలా జాగ్రత్తలు తీసుకుని వినియోగదారులకు ఈజీ సేవలు అందిస్తున్నప్పటికి కూడా ఏదో విధంగా హ్యాకర్స్ వాట్సాప్ మీద దాడి చేస్తూనే ఉన్నారు. కొత్త కొత్త టెక్నాలజీలను వాడుకుని స్కామ్‌లు, డేటా చోరీలు లాంటివి చేస్తున్నారు. తాజాగా  వాట్సాప్ వీడియో కాల్స్‌లో కొత్త రకం స్కామ్ వెలుగులోకి వచ్చింది. అయితే ఈ స్కామ్‌లో కృత్రిమ మేధస్సు(AI) ముఖ్యపాత్ర పోషించింది.

హ్యాకర్స్ తెలియని unknown నెంబర్ నుంచి వీడియో కాల్ చేసి డబ్బులు కాజేస్తున్నారు. వీడియో కాల్స్ మాట్లాడే సమయంలో కృత్రిమ మేధస్సు(AI) ను ఉపయోగించుకుని తెలిసిన దగ్గరి బంధువుల మాదిరిగా ముఖాన్ని కనిపించేలా చేసి, వాయిస్‌ను కూడా కొత్తగా సృష్టించి అర్జంట్‌గా డబ్బులు అవసరం ఉంది, పంపగలరని రిక్వెస్ట్ చేసి డబ్బులను వారి అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేయించుకుంటున్నారు. అలాగే, కొన్ని సార్లు బ్యాంకు వివరాలు, OTP లను చెప్పాలని తెలిసిన బంధువుల మాదిరిగా వీడియో కాల్స్ చేస్తూ యూజర్ల డబ్బులు, ఇతర వివరాలను కాజేస్తున్నారు.

ఇటీవల ఇలాంటి సంఘటన ఒకటి ఢిల్లీలో జరిగింది. వాట్సాప్‌లో ఓ మహిళకు తెలియని నంబర్‌ నుంచి వీడియో కాల్‌ వచ్చింది. ఈ కాల్‌లో ఆమె భర్త మోహం కనిపించింది. అలాగే వాయిస్ కూడా ఆమె భర్త వాయిస్‌లాగే ఉండటంతో అతను చెప్పిన విధంగా రూ. 2 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసింది. ఆ తర్వాత అసలు విషయం తెలిసింది. ఈ వీడియో కాల్‌లో మాట్లాడింది ఆమె భర్త కాదని అతని మాదిరిగా ముఖాన్ని, వాయిస్‌ను సృష్టించి వీడియో కాల్ చేసి వేరే వాళ్లు డబ్బులు కాజేసినట్టు తెలుసుకుంది. ఈ విషయం గురించి సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌కు ఫిర్యాదు చేసింది.

స్కామర్‌లు కృత్రిమ మేధస్సు(AI) ని ఉపయోగించి వాట్సాప్ వీడియో కాల్స్ చేస్తూ యూజర్లను మోసం చేస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు. ప్రస్తుతం ఇలాంటి స్కామ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు. ఫ్యూచర్ క్రైమ్ రీసెర్చ్ ఫౌండేషన్ (FCRF) ప్రకారం, ఇలాంటి కేసులలో 18 శాతం రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ తదితర చోట్ల ఎక్కువగా జరుగుతున్నాయి.

సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా ద్వారా వ్యక్తుల ఫొటోలను సేకరించి కృత్రిమ మేధస్సు(AI) సహాయంతో ముఖాన్ని వారిలా సృష్టించి ఆ వ్యక్తుల దగ్గరి బంధువులకు వీడియో కాల్స్ చేస్తున్నారు. వీడియో కాల్స్‌ మాట్లాడే సమయంలో అవతలి వారు తమ బంధువులే అని భావించి మోసపోతున్నారని పోలీసులు తెలిపారు. కాబట్టి తెలియని నెంబర్ల నుంచి కాల్స్ వస్తే వాటిని స్వీకరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News