WhatsApp నుంచి మరో అదిరిపోయే ఫీచర్

ఇటీవల గత కొద్ది రోజులుగా మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది.

Update: 2023-10-20 11:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల గత కొద్ది రోజులుగా మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది.తాజాగా వాయిస్‌ నోట్‌లకు ‘వ్యూ వన్స్(ఒకసారి వీక్షించండి)’ అనే సదుపాయాన్ని త్వరలో తీసుకురానున్నట్లు పేర్కొంది. ఇంతకు ముందు ఫొటోలు, వీడియోలకు వ్యూ వన్స్ అనే ఆప్షన్ అందుబాటులో ఉండగా, ఇప్పుడు దీన్ని వాయిస్‌ నోట్‌లకు కూడా అందించనున్నారు..

వ్యూ వన్స్ ఆప్షన్ ద్వారా ఒకసారి పంపిన ఆడియో మెసేజ్‌ను అవతలి వారు ఒక్కసారి మాత్రమే ప్లే చేయడం కుదురుతుంది. రెండోసారి ప్లే చేయడం కానీ, సేవ్ చేయడం కానీ సాధ్యపడదు. ప్రస్తుతానికి ఇది టెస్టింగ్ స్టేజ్‌లోనే ఉంది. ఆండ్రాయిడ్ 2.23.21.15, 2.23.22.4 కోసం, iOS 23.21.1.73 బీటా టెస్టర్లకు 'వ్యూ వన్స్' మోడ్ ఫీచర్‌ అనుకూలంగా ఉంది. త్వరలో అన్ని వెర్షన్‌లకు విడుదల చేయనున్నారు.

వాట్సాప్ తాజాగా వినియోగదారులకు యాప్‌లో లాగిన్ అయ్యేటప్పుడు మరింత భద్రత ఇవ్వడానికి పాస్‌కీలను తెచ్చింది. అలాగే ఒకే వాట్సాప్‌లో ఎక్కువ అకౌంట్లను ఉపయోగించుకునేలా కొత్త సదుపాయం కూడా త్వరలో తీసుకొస్తున్నట్లు కంపెనీ గతంలో ప్రకటించగా, దీనిని కూడా మరికొద్ది రోజుల్లో లాంచ్ చేయనున్నారు.

Tags:    

Similar News