మనదేశంలో టాప్ - 5 స్మార్ట్ వాచ్‌లు ఏవంటే..
ప్రస్తుత కాలంలో ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్, ఎవరి చేతికి చూసిన స్మార్ట్ వాచ్ లే ఎక్కువగా తారసపడుతున్నాయి.
దిశ, ఫీచర్స్ : ప్రస్తుత కాలంలో ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్, ఎవరి చేతికి చూసిన స్మార్ట్ వాచ్ లే ఎక్కువగా తారసపడుతున్నాయి. ఈ రెండింటి అమ్మకాలు ప్రపంచ వ్యాప్తంగా ఓ ఊపందుకున్నాయి. చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే ముసలివారి వరకు స్మార్ట్ వాచ్ లను ఎక్కువగా వాడుతున్నారు. మరి భారతదేశంలో హాట్ కేకుల్లా సేల్ అయిన లాప్ 5 స్మార్ట్ వాచ్ లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
ఫిట్‌బిట్ వెర్సా 2
టాప్ 5 స్మార్ట్ వాచ్ ల జాబితాలో ఫిట్‌బిట్ వెర్సా 2 మొదటి స్థానంలో ఉంది. ఈ వాచ్ లో ఆరోగ్య సంబంధిత సమాచారం, స్లీప్ ట్రాకింగ్, హృదయ స్పందన రేటును తెలుసుకునే ఫీచర్స్ ఉన్నాయి. దీని బ్యాటరీ ఆరు రోజులు లైఫ్ ఇస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్ అలెక్సా ఫీచర్ సహాయంతో వార్తలు, వాతావరణ సమాచారాన్ని అందిస్తుంది.
గార్మిన్ అప్రోచ్ ఎస్ 12
ఇండియాలో టాప్ 5 స్మార్ట్ వాచ్ ల జాబితాలో గార్మిన్ అప్రోచ్ ఎస్ 12 వాచ్ ఒకటి. ఈ వాచ్ లో జీపీఎస్ ఆప్షన్ ఉంది. ఈ ఫీచర్ ప్యాక్డ్ స్మార్ట్ వాచ్ డిజైన్ స్పోర్టీగా ఉంది. ఇది క్రీడాకారులకు యూస్ ఫుల్ గా ఉంటుంది.
ఫాజిల్ జెన్ 6
టాప్ 5 స్మార్ట్ వాచ్ ల జాబితాలో ఫాజిల్ జెన్ 6 కూడా ఉంది. ఈ వాచ్ గూగుల్ వేర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఐవోఎస్, ఆండ్రాయిడ్ రెండింటిలోనూ పనిచేస్తుంది. స్లీప్, హెల్త్ రేటు, ఆక్సిజన్ స్థాయిలను ఈ మొబైల్ లో చూసుకోవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ రాపిడ్ ఛార్జింగ్, ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే ఫీచర్ లతో ఈ వాచ్ ఉంటుంది.
డీజిల్ జెన్ 6
టాప్ 5 స్మార్ట్ వాచ్ ల జాబితాలో డీజిల్ జెన్ 6 స్మార్ట్‌వాచ్‌లో ఒకటి. గూగుల్ వేర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫీచర్ తో ఈ వాచ్ లో ఉండడంతో ఏ ఫోన్‌లో అయినా వివిధ రకాల యాప్‌లను ఆపరేట్ చేయవచ్చు.
అమేజ్‌ఫిట్ టి - రెక్స్
టాప్ 5 స్మార్ట్ వాచ్ ల జాబితాలో అమేజ్‌ఫిట్ టి -రెక్స్ స్థానం దక్కించుకుంది. ఈ వాచ్ మిలిటరీ స్టాండర్డ్ టెస్టుల్లో ఉత్తీర్ణత సాధించింది. 1.39 అంగుళాల హెచ్‌డీ అమోఎల్ఈడీ డిస్‌ప్లే తో అత్యాధునిక ఫీచర్స్ కలిగి ఉంది.