WhatsApp యూజర్లకు మరో కీలక అప్‌డేట్

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కీలక అప్‌డేట్‌ను తీసుకురానుంది.

Update: 2023-06-29 14:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కీలక అప్‌డేట్‌ను తీసుకురానుంది. Windows డెస్క్‌టాప్ యాప్ వినియోగదారుల కోసం కొత్తగా వీడియో కాల్స్ విషయంలో కీలక మార్పులు చేసింది. ఇకమీదట విండోస్ పీసీ యూజర్లు గరిష్టంగా 32 మంది యూజర్లతో వీడియో కాల్స్ చేసుకునే ఆప్షన్‌ను అందిస్తున్నారు. ఇప్పటి వరకు వాట్సాప్ ఆడియో కాల్స్ 32 మంది యూజర్లకు చేసుకునే ఆప్షన్ అందుబాటులో ఉంది, ఈ కొత్త సదుపాయం ద్వారా వాట్సాప్ నుంచి 32 మందితో నేరుగా వీడియో కాల్స్ మాట్లాడవచ్చు.

ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ను బీటా టెస్టర్లకు మాత్రమే విడుదల చేస్తున్నారు. ఈ ఫీచర్‌ను పొందడానికి యూజర్లు బీటా అప్‌డేట్ 2.23.24.1.0ని ఇన్‌స్టాల్ చేయాలి. విండోస్ యాప్ నుండి నేరుగా కాంటాక్ట్‌లు, గ్రూప్‌లకు వీడియో కాల్‌లు చేసి, గరిష్టంగా 32 మంది వ్యక్తులతో కాల్స్ మాట్లాడవచ్చు. టెస్టింగ్ పూర్తయ్యాక మిగతా యూజర్లకు ఈ అప్‌డేట్‌ను విడుదల చేస్తామని కంపెనీ పేర్కొంది. ఈ ఫీచర్ గురించి గత ఏడాది నవంబర్‌లో CEO మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు.

Tags:    

Similar News