డిజిటల్ జీవితంలో ఒత్తిడిని తగ్గించే ట్రిక్స్.. అవేంటో చూసేద్దామా..

డిజిటల్ జీవితంలో సోషల్ మీడియా ట్రెండ్ వేగంగా పెరుగుతోంది.

Update: 2024-04-15 14:05 GMT

దిశ, ఫీచర్స్ : డిజిటల్ జీవితంలో సోషల్ మీడియా ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. ఉద్యోగరీత్యా కుటుంబాలకు దూరంగా ఉండేవారు ఎక్కువ సమయం సోషల్ మీడియాలో గడపడం ఇందుకు ఒక కారణం. అయితే ప్రారంభంలో ఈ వినియోగదారులకు సోషల్ మీడియా నుంచి ఎక్కవ హాని కలిగించదు. కానీ వినియోగదారులు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌కు బానిస అయినప్పుడు తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. చిరాకుగా ఉండడం, మానసిక ఆరోగ్యం దెబ్బతినడం వంటి సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. మీ చుట్టుపక్కల ఎవరైనా సోషల్ మీడియాకు బానిసలైతే దాని నివారించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. మరి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సోషల్ మీడియా వ్యసనం ఎలా ఏర్పడుతుంది ?

నేటి కాలంలో కరెంటు బిల్లు కట్టాలన్నా, ఇంటి సామాన్లు తీసుకోవాలన్నా ప్రజలు ఇవన్నీ ఆన్‌లైన్‌ నుంచే చేసేస్తారు. సోషల్ మీడియాలో సేవలను వినియోగించడం మాత్రమే కాకుండా ఇతర ప్రకటనలను కూడా చూడటం ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఒకదాని వెనక ఒకటి చూస్తూ ఉండిపోతారు. దీంతో వినియోగదారులు సోషల్ మీడియాలో నిమగ్నమై ఉంటారు.

రోజూ 6 గంటలు ఇంటర్నెట్‌లో గడుపుతున్న 16 నుండి 64 ఏండ్ల వ్యక్తులు..

ప్రజలు ఫిట్‌నెస్ నుండి టెక్ ఫ్రీగా ఉండటం వరకు అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. డేటాపోర్టల్ ఇటీవల కాలంలో గ్లోబల్ ఓవర్‌వ్యూ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం 16-64 సంవత్సరాల వయస్సు గలవారు రోజుకు 6 గంటలు ఇంటర్నెట్‌లో గడుపుతున్నారు. ఇలా ఎక్కువ సేపు స్క్రీన్‌లను చూడడాన్ని డిజిటల్ అడిక్షన్ అంటారు. దీన్ని నివారించడానికి అనేక సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. దీని ద్వారా మీ డిజిటల్ వ్యసనాన్ని తగ్గించడమే కాకుండా కొత్త అలవాట్లను ఏర్పరచుకోవడంలో మీకు సహాయపడతాయి.

జీవితంలో డిజిటల్ వ్యసనాన్ని వదిలిచ్చుకునే మార్గాలు.. ?

ధ్యానం, యోగా..

మీరు సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపకుండా ఉండాలనుకుంటే ధ్యానం, యోగా చేయడం అలవాటు చేసుకోవాలి. ఇది మీకు పాజిటివ్ ఎనర్జీతో పాటు అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే మీ మానసిక ఆరోగ్యం బలపడుతుంది. మీ ఫిట్‌నెస్ కూడా మెరుగుపడుతుంది.

మంచి పుస్తకాలను చదవడం..

మీ ఖాళీ సమయాన్ని గడపడానికి, మీరు మంచి రచయితల పుస్తకాలను కూడా చదవవచ్చు. అలాగే మతపరమైన స్వభావం కలిగి ఉంటే మతపరమైన గ్రంథాలను కూడా చదవవచ్చు. ఇది మీ అవగాహనను పెంచడమే కాకుండా మీ జ్ఞానాన్ని కూడా పెంచుతుంది.


Similar News