Xiaomi రికార్డును బ్రేక్ చేయనున్న ఐఫోన్ కొత్త మోడల్

త్వరలో లాంచ్ కానున్న ఐఫోన్ 15 స్మార్ట్ ఫోన్ గురించి ఒక ఆసక్తికర అంశం బయటకు వచ్చింది.

Update: 2023-03-19 09:10 GMT
Xiaomi రికార్డును బ్రేక్ చేయనున్న ఐఫోన్ కొత్త మోడల్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: త్వరలో లాంచ్ కానున్న ఐఫోన్ 15 స్మార్ట్ ఫోన్ గురించి ఒక ఆసక్తికర అంశం బయటకు వచ్చింది. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌ల ఫ్రంట్ గ్లాస్ వీడియోలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. దీని ప్రకారం, ఈ స్మార్ట్ ఫోన్‌ల డిస్‌ప్లేకు, ఫోన్ ఫ్రేమ్‌కు మధ్య అంచు చాలా సన్నగా ఉంటుందని సమాచారం. ఇప్పటి వరకు Xiaomi 13కి 1.81mm చాలా సన్నని స్క్రీన్ బెజెల్‌ను కలిగి ఉంది. కానీ ఇప్పుడు ఐఫోన్ 15 ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్స్‌లో అంతకన్న తక్కువగా 1.55 mm గల స్క్రీన్ బెజెల్ ఉండనుంది. ఈ కొత్త ఐఫోన్ మోడల్స్‌లో హాప్టిక్ ఫీడ్‌బ్యాక్‌తో కూడిన సాలిడ్-స్టేట్ బటన్‌లు, టైటానియం ఫ్రేమ్, ఎక్కువ ర్యామ్ వంటి కొత్త ఫీచర్లు ఉండవచ్చని సమాచారం.

ఇవి కూడా చదవండి : రూ.10 వేల ధరలో Realme అతి సన్నని స్మార్ట్ ఫోన్



Tags:    

Similar News