Jio యూజర్లకు బిగ్ షాక్.. ఆ రెండు డేటా ప్లాన్ల వ్యాలిడిటీ పై సంచలన ప్రకటన
జియో వినియోగదారులకు మరో బిగ్ షాక్ తగిలింది.

దిశ,వెబ్‌డెస్క్: జియో వినియోగదారులకు మరో బిగ్ షాక్ తగిలింది. దేశంలోని అతి పెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో(Reliance Jio)తో పాటు ఇతర కంపెనీలకు ట్రాయ్ కాలింగ్, SMS లతో కూడిన తక్కువ ధర ప్లాన్ అందించాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జియో కాలింగ్(Jio Calling), SMS తో రెండు చౌక ప్లాన్స్ ను ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో ట్రాయ్ ఆదేశాలను అనుసరించి జియో ఇటీవల వాయిస్ ఓన్లీ పేరిట రెండు రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
రూ. 458, రూ. 1,958 ప్లాన్‌లను ప్రారంభించింది. రూ.458 ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. దీనిలో దేశీయంగా ఉచిత అపరిమిత కాలింగ్(Unlimited calling)తో పాటు 1,000 ఉచిత SMSలను పొందవచ్చు. అలాగే జియో సినిమా(Jio Cinima), జియో టీవీ(Jio TV) యాప్‌లకు కూడా అందుబాటులో ఉంటుంది. అదే విధంగా రూ.1,958 ప్లాన్ 365 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. దీనిలో ఉచిత అపరిమిత కాలింగ్, 3,600 SMSలు లభిస్తాయి. అయితే వీటికి మొబైల్ డేటా(Mobile Data) ఇవ్వలేదు.
ఇదిలా ఉంటే.. తాజాగా రిలయన్స్ జియో తమ యూజర్లకు మరో బిగ్ షాక్ ఇచ్చింది. తాజాగా రెండు డేటా ప్లాన్ల వ్యాలిడిటీని తగ్గించింది. ఇటీవల రెండు పాప్యులర్ రీఛార్జి ప్లాన్లు రూ. 189, రూ. 479లను తొలగించిన జియో.. ఇప్పుడు రూ. 69, రూ.139 డేటా ప్లాన్(Data Plan) గడువును తగ్గించి, కేవలం ఏడు రోజులుగా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఈ డేటా ప్లాన్ల(Data Plan) గడువు బేస్ ప్లాన్ ఎన్ని రోజులు ఉంటే అప్పటివరకు ఉండేది. ఇకపై రూ. 69తో రీఛార్జ్ చేసుకుంటే 6జీబీ, రూ. 139తో చేస్తే వచ్చే 12 జీబీ డేటా వారం రోజులే వస్తుంది. ఈ మేరకు జియో తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.