ఇకపై WhatsApp చాటింగ్‌లోనే స్టేటస్ చూడచ్చు!
దిశ, వెబ్‌డెస్క్: మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ WhatsApp తన వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది..Latest Telugu News
దిశ, వెబ్‌డెస్క్: మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ WhatsApp తన వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. ఇటీవల కాలంలో CEO మార్క్ జుకర్‌బర్గ్.. పలు కొత్త ఫీచర్లను వినియోగదారులకు పరిచయం చేయనున్నట్లు ప్రకటించారు. దానికి అనుగుణంగా వరుసగా ప్రైవసీ ఫీచర్లు, గ్రూప్‌లపై అడ్మిన్‌కు కంట్రోలింగ్ మొదలగు ఫీచర్లను కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే బీటా వెర్షన్‌లకు ఇవి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకొక ఫీచర్‌ను తీసుకురానున్నట్లు తెలిపింది.
WABetaInfo ప్రకారం, వాట్సాప్ స్టేటస్‌లను, చాట్ లిస్ట్‌లో చూసే విధంగా కొత్త ఫీచర్ రానుంది. దీని వలన ప్రత్యేకంగా స్టేటస్ బార్‌పై క్లిక్ చేయకుండా స్టేటస్‌లను వ్యక్తుల చాట్‌లోనే చూడవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా వెర్షన్ 22.18.0.70కు టెస్టింగ్ దశలో ఉంది. త్వరలో ఇది అన్ని iOS, ఆండ్రాయిడ్ డివైజ్‌లకు అందుబాటులోకి రానుందని కంపెనీ తెలిపింది.