Samsung నుంచి రాబోతున్న Galaxy M34 5G స్మార్ట్ ఫోన్
స్మార్ట్ ఫోన్ దిగ్గజం శామ్‌సంగ్ నుంచి కొత్త మోడల్ భారత్‌లోకి విడుదల కానుంది. ఈ మోడల్ పేరు ‘Galaxy M34 5G’.
దిశ, వెబ్‌డెస్క్: స్మార్ట్ ఫోన్ దిగ్గజం శామ్‌సంగ్ నుంచి కొత్త మోడల్ భారత్‌లోకి విడుదల కానుంది. ఈ మోడల్ పేరు ‘Galaxy M34 5G’. ఈ కామర్స్ సైట్ అమెజాన్ ఈ ఫోన్ లాంచ్ గురించి తన పేజీలో నోటిఫికేషన్ పెట్టింది. లాంచ్ తేదీని పేర్కొననప్పటికి త్వరలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
గెలాక్సీ M34 5G ఫోన్ 6.6-అంగుళాల పూర్తి-HD+ AMOLED డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఇది MediaTek డైమెన్సిటీ 1080 SoC ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 13 లో రన్ అవుతుంది. ఫోన్‌లో బ్యాక్ సైడ్ 48-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 5-మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీల కోసం ముందు 13-మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. 25W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో రానుంది. అమెజాన్‌తో పాటు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలుకు వస్తుంది.