Instagramలో రీల్స్ డౌన్‌లోడ్ ఆప్షన్
మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ కొత్తగా మరో ఫీచర్‌ను తీసుకొచ్చింది. పబ్లిక్ అకౌంట్స్ నుంచి రీల్స్, వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్‌ను విడుదల చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ కొత్తగా మరో ఫీచర్‌ను తీసుకొచ్చింది. పబ్లిక్ అకౌంట్స్ నుంచి రీల్స్, వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్‌ను విడుదల చేసింది. గతంలో రీల్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోడానికి థర్డ్ పార్టీ యాప్‌లు లేదా ఇతర ప్లాట్‌ఫామ్స్‌ను వాడేవారు. ఇక మీదట ఆ ఇబ్బంది లేకుండా నేరుగా రీల్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాప్‌లో షేరింగ్ ఆప్షన్ ప్రక్కన డౌన్‌లోడ్ సింబల్ కనిపిస్తుంది. దీని ద్వారా పబ్లిక్ అకౌంట్స్ నుంచి రీల్స్ డౌన్‌లోడ్ అవుతాయి. అయితే పబ్లిక్ అకౌంట్స్ హోల్డర్లు మాత్రమే రీల్స్ డౌన్‌లోడ్ సెట్టింగ్‌ను ఎనెబుల్ లేదా డిసెబుల్ చేయగలరు. 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు గల వారికి ఈ ఫీచర్ అందుబాటులో ఉండదు.