మార్కెట్లోకి Realme కొత్త స్మార్ట్‌ఫోన్.. ఉచితంగా ఇయర్‌ఫోన్స్

చైనాకు చెందిన రియల్‌మీ కంపెనీ ఇండియాలో కొత్త మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీని పేరు ‘Realme Narzo 70 Pro 5G’

Update: 2024-03-19 12:19 GMT

దిశ, టెక్నాలజీ: చైనాకు చెందిన రియల్‌మీ కంపెనీ ఇండియాలో కొత్త మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీని పేరు ‘Realme Narzo 70 Pro 5G’. ఇది మూడు సంవత్సరాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తో పాటు, రెండు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను సైతం పొందుతుందని కంపెనీ పేర్కొంది. 8GB RAM+ 128GB స్టోరేజ్ ధర రూ.18,999. 8GB RAM+ 256GB వేరియంట్ ధర రూ. 19,999.

ఫోన్‌ను తడిచేతితో కూడా ఆపరేటింగ్ చేయవచ్చు. మార్చి 22 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్, కంపెనీ వెబ్‌సైట్ ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. కొనుగోలు చేసే సమయంలో ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై తగ్గింపులు కూడా ఉన్నాయి. మార్చి 19న సాయంత్రం 6 గంటలకు నుండి ఎర్లీ బర్డ్ సేల్ ప్రారంభమవుతుంది. దీనిలో భాగంగా కస్టమర్లకు రూ.2,299 విలువైన T300 TWS ఇయర్‌ఫోన్‌లను ఉచితంగా అందిస్తారు.

Realme Narzo 70 Pro 5G ఫీచర్స్

* 6.67-అంగుళాల పూర్తి-HD+ (2,400 x 1,080 పిక్సెల్‌లు) OLED డిస్‌ప్లే.

* 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌.

* ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 7050 SoC ద్వారా పనిచేస్తుంది.

* Android 14-ఆధారిత Realme UI 5.1తో రన్ అవుతుంది.

* బ్యాక్ సైడ్ 50-మెగాపిక్సెల్ సోనీ IMX890 ప్రైమరీ కెమెరా ఉంది.

* ముందు సెల్ఫీల కోసం 16-మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

* ఫోన్ 67W ఫాస్ట్ చార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీతో వచ్చింది.

* ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ డిస్‌ప్లేలో ఉంటుంది.


Similar News