మీ WhatsApp చాటింగ్‌లను ప్రభుత్వం చదువుతుందా..!?
దిశ, వెబ్‌డెస్క్: వాట్సాప్ చాటింగ్‌లను కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని ఇటీవల వచ్చిన వార్తలపై స్పందించిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB),..Latest Telugu News
దిశ, వెబ్‌డెస్క్: వాట్సాప్ చాటింగ్‌లను కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని ఇటీవల వచ్చిన వార్తలపై స్పందించిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB), ఈ వార్తలు అవాస్తవమని దీనికి సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేయలేదని తెలిపింది.
''ఇటీవల WhatsApp చాటింగ్‌లను ప్రభుత్వం పర్యవేక్షించడానికి కొత్తగా సర్క్యులేషన్ జారీ చేసిందని, అలాగే 2 బ్లూ కలర్ టిక్‌లు ఉంటే మెసేజ్ చదివారని, మూడు బ్లూ కలర్ టిక్‌లు ఉంటే వాటిని ప్రభుత్వం చదివిందని, 2 బ్లూ,1 రెడ్ టిక్ ఉంటే ప్రభుత్వం మీపై చర్యలు తీసుకోవచ్చని, అదే ఒక బ్లూ టిక్, రెండు రెడ్ టిక్‌లు ఉంటే ప్రభుత్వం మీ డేటాను పర్యవేక్షిస్తుందని, మూడు రెడ్ టిక్‌లు ఉంటే ప్రభుత్వం మీపై చర్యలు ప్రారంభించిందని, అలాగే మీకు కోర్టు నుండి సమన్లు జారీ అవుతాయని'' పేర్కొంటూ నకిలీ వార్త ఒకటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది.
ఈ నకిలీ వార్తలపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పందించి ఇవన్నీ తప్పుడు వార్తలు. ప్రభుత్వం WhatsApp చాటింగ్‌లను పర్యవేక్షించడం లేదు. ఇవి తప్పుడు సమాచారాన్ని చేరవేసే విధంగా ఉన్నాయి. ఇలాంటి తప్పుడు వార్తలు సర్క్యులేట్ చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ట్విట్టర్ వేదికగా PIB తెలిపింది.