రెండు సార్లు టచ్ చేస్తే చాలు.. ఫొటోలు తీసే Oppo కొత్త ఇయర్‌బడ్స్

దిశ, వెబ్‌డెస్క్: స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ Oppo కొత్తగా 'Enco Buds 2' ను విడుదల చేసింది..Latest Telugu News

Update: 2022-08-25 13:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ Oppo కొత్తగా 'Enco Buds 2' ను విడుదల చేసింది. కొత్త వైర్‌లెస్ స్టీరియో(TWS) ఇయర్‌బడ్‌లు AI నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌లతో వస్తున్నాయి. మ్యూజిక్‌ను టచ్ బటన్‌ల ద్వారా కంట్రోల్ చేయవచ్చు. ఇయర్‌బడ్స్ టచ్ బటన్‌లను రెండు సార్లు ప్రెస్ చేయడం ద్వారా ఫోన్ కెమెరాలో ఫొటోలు తీస్తుంది. దీని ద్వారా ఎవరి సహాయం లేకుండా ఎవరికి వారు ఫొటోలు తీసుకోవచ్చు. ఇయర్‌బడ్స్ బ్లూటూత్ v5.2ని కలిగి ఉంది. ఇది 10 మీటర్ల పరిధి వరకు కనెక్టివిటీని కలిగి ఉంటుంది.

ఇవి కూడా చదవండి : ECG, హెల్త్ మానిటరింగ్ ఫీచర్లతో అదిరిపోయే గూగుల్ 'ఫిట్‌బిట్' స్మార్ట్ వాచ్‌లు 



ఇది 40mAh బ్యాటరీని కలిగి ఉంది. ఛార్జింగ్ కేస్ లోపల 460 mAh బ్యాటరీ కూడా ఉంది. ఒక్క ఛార్జ్‌పై 7 గంటల బ్యాటరీ బ్యాకప్, 28 గంటల మొత్తం బ్యాటరీ బ్యాకప్‌ వస్తుందని కంపెనీ పేర్కొంది. IPX4 రేటింగ్ ద్వారా దుమ్ము, నీటి నుంచి రక్షణ కలిగి ఉంది. 101dB డ్రైవర్ సెన్సిటివిటీ, 20Hz -20,000Hz వరకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ రేంజ్‌తో 10mm టైటానియం డ్రైవర్‌ల ద్వారా పని చేస్తుంది.


మంచి సౌండ్ కోసం డాల్బీ అట్మోస్‌తో పాటు కంపెనీ ఎన్కో లైవ్ స్టీరియో సౌండ్ ఎఫెక్ట్‌లకు సపోర్ట్ ఇస్తుంది. అద్భుతమైన గేమింగ్ అనుభవాన్ని ఇవ్వడానికి ప్రత్యేకంగా 80ms వరకు తక్కువ-లేటెన్సీ రేటు కలిగి ఉంది.Oppo Enco Buds 2 ధర రూ.1,799. ఇవి కంపెనీ వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఆగస్టు 31 నుండి అమ్మకానికి రానుంది.




Similar News