చాట్‌ జీపీటీకి పోటీగా.. జియో భారత్‌ జీపీటీ ..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనుషులు లేదా జంతువుల మేధస్సుకు భిన్నంగా ఉండే యంత్రాలు, సాఫ్ట్‌వేర్ మేధస్సు.

Update: 2023-12-31 14:45 GMT

దిశ, ఫీచర్స్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనుషులు లేదా జంతువుల మేధస్సుకు భిన్నంగా ఉండే యంత్రాలు, సాఫ్ట్‌వేర్ మేధస్సు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం టెక్‌లోనే హాటెస్ట్ బజ్‌వర్డ్‌లలో ఒకటి. 1956లో రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదం పెరిగిన డేటా వాల్యూమ్‌లు, అధునాతన అల్గారిథమ్‌లు, కంప్యూటింగ్ పవర్, స్టోరేజ్‌లో మెరుగుదలల కారణంగా నేడు మరింత ప్రజాదరణ పొందింది.

ప్రస్తుతం టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, చాట్‌జీపీటీ సంచలనం సృష్టిస్తుంది. ప్రముఖ గ్లోబల్ టెక్ దిగ్గజాలు ఓపెన్ ఏఐతో పాటు సొంత చాట్ బోట్‌లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఏఐ ఆధారిత వ్యవస్థలోకి అడుగుపెట్టి ‘భారత్ జీపీటీ’ డెవలప్‌మెంట్‌ పై ఐఐటీ-బాంబేతో కలిసి పనిచేస్తుందని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ముంబైలో నిర్వహించిన ‘టెక్ ఫెస్ట్’లో ప్రకటించారు.

రిలయన్స్ జియో, ఐఐటీ బాంబే సంయుక్తంగా భారత్ జీపీటీని చాట్ జీపీటీ తరహాలో అభివృద్ధి చేస్తున్నాయన్నారు. ఈ భారత్ జీపీటీని "జియో 2.0" అని పిలుస్తున్నారని తెలిపారు. జియో 2.0 పై ఇప్పటికే పనులు ప్రారంభించామని తెలిపారు. రిలయన్స్ జియో విస్తృత విజన్ లో భాగంగా భారత్ జీపీటీని రూపొందించారన్నారు. ఏఐ సేవలను రిలయన్స్ సంస్థలోని అన్ని విభాగాల్లో ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని ఆకాశ్ అంబానీ తెలిపారు.

ఐఐటీ బాంబే 2014 నుంచి వివిధ కార్యక్రమాల రూపకల్పనల్లో రిలయన్స్ తో భాగస్వామిగా ఉంది. ఐఐటీ బాంబే లోని ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ విభాగాలు రిలయన్స్ జియో సహకారంతో జీపీటీ సొల్యూషన్స్‌, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, భారత్ జీపీటీని అభివృద్ధి చేయడానికి పరిశోధనలను కొనసాగిస్తుంది.

Tags:    

Similar News