ఆ రెండు నెట్వర్క్ ల లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్‌తో ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్ చూసెయ్యండి...

తమ కస్టమర్ల కోసం ప్రముఖ టెలికాం దిగ్గజాలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి.

Update: 2024-01-03 14:36 GMT

దిశ, ఫీచర్స్ : తమ కస్టమర్ల కోసం ప్రముఖ టెలికాం దిగ్గజాలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. ఇందులో భాగంగానే తమ యూజర్లకోసం ఎయిర్‌టెల్, జియో కంపెనీలు ప్రత్యేకమైన ఆఫర్లను అందించింది. కాంబో ప్యాక్ ఆఫర్లను జియో, ఎయిర్‌టెల్ రెండూ కంపెనీలు ప్రకటించాయి. ఈ కాంబో ప్యాక్ లో ఉచిత నెట్‌ఫ్లిక్స్‌, 5జీ అన్‌లిమిటెడ్ ఆఫర్లతో పాటు మరెన్నో బెనిఫిట్స్ ను కలిపి అందిస్తుంది. ఎయిర్‌టెల్, జియో కంపెనీలు ఇస్తున్న ఆఫర్ల వివరాలేంటో చూసేద్దాం..

జియో రీఛార్జ్ ప్లాన్..

రిలయన్స్ జియోలో 1,499తో రీఛార్జ్ చేసుకుంటే అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు రోజుకు 3 జీబీ డేటాను అందిస్తుంది. అన్ని డివైజ్‌లకు ఈ నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ లభిస్తుంది. వీటితో పాటుగా జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్‌లు, జియో టీవీ, జియో సినిమా ఫ్రీగా లభించనన్నాయి. 84 రోజుల పాటు ఈ ప్లాన్ వాలిడ్ గా ఉంటుంది. రూ.1,099తో రీఛార్జ్ చేసుకుంటే అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఫ్రీ ఎస్ఎంఎస్ లు, 2 జీబీ రోజువారీ డేటాతో పాటు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్, అపరిమితంగా 5జీ డేటాను పొందొచ్చు.

ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్..

ఇక ఎయిర్ టెల్ అందించిన ప్లాన్ విషయానికి వస్తే రూ.1,499 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు వంద ఉచిత ఎస్ఎంఎస్ లు, ఉచిత హలో ట్యూన్స్, 3 నెలల అపోలో 24/7, అన్‌లిమిటెడ్ 5జీ డేటా, వింక్ మ్యూజిక్ లో పాటు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌ బేసిక్ సబ్‌స్క్రిప్షన్ లభించనుంది. 84 రోజుల పాటు ఈ ప్లాన్ వాలిడ్ గా ఉంటుంది.

Tags:    

Similar News