iPhone 16 Price Drop: ఐఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా తగ్గిన ధరలు..కొనడానికి ఇదే బెస్ట్ టైమ్

iPhone 16 Price Drop: ఐఫోన్ 16 కొనేందుకు ఇదే మంచి సమయం ప్లిప్ కార్ట్ సేల్ లో ఐఫోన్ 16 పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది.

Update: 2025-01-14 14:07 GMT
iPhone 16 Price Drop: ఐఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా తగ్గిన ధరలు..కొనడానికి ఇదే బెస్ట్ టైమ్
  • whatsapp icon

iPhone 16 Price Drop: రిపబ్లిక్ డేను పురస్కరించుకుని ఫ్లిప్ కార్ట్ లో సేల్ షురూ అయ్యింది. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లు, వేరబుల్స్, ల్యాప్ టాప్స్ వంటి పలు ఎలక్ట్రానిక్ వస్తువులు బ్యాంక్ ఆఫర్స్ తో పాటు భారీ డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల మీ స్మార్ట్ ఫోన్ అప్ గ్రేడ్ కోసం ప్లాన్ చేస్తుంటే, ఫ్లాగ్ షిప్ మోడల్ పొందేందుకు ఇది సరైన సమయం. అదనంగా ఫ్లిప్ కార్ట్ ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఇది ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయినప్పటి నుంచి అతి తక్కువ ధర. కాబట్టి ఫ్లిప్ కార్ట్ నుంచి తక్కువ ధరకు ఐఫోన్ 16ను ఎలా కొనుగోలు చేయవచ్చో తెలుసుకోండి.

ఐఫోన్ 16, 128 జీబీ వేరియంట్ ఒరిజినల్ ధర రూ. 79,990గా ఉంది. అయితే ప్రస్తుతం నడుస్తున్న ఫ్లిప్ కార్ట్ సేల్ లో ఈ స్మార్ట్ ఫోన్ పై 12శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ లో ఐఫోన్ 16, 128 జీబీ వేరియంట్ కేవలం రూ. 69, 999కే లభిస్తోంది. ఈ డిస్కౌంట్ తో పాటు ఈ ఫ్లాగ్ షిప్ మోడల్ పై బ్యాంక్, ఎక్స్చేంజ్ ఆఫర్లతో అదనపు డిస్కౌంట్స్ పొందవచ్చు.

ఫ్లిప్ కార్ట్ లిస్టింగ్ ప్రకారం కొనుగోలుదారులు హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ క్రెడిట్ కార్ట్, ఈఎంఐ లావాదేవీలపై కనీసం రూ. 4,999 లావాదేవీ విలువతో రూ. 1500 వరకు 10శాతం డిస్కౌంట్ పొందవచ్చు. అదనంగా కొనుగోలుదారులు హెచ్డీఎఫ్ సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ. 1000 వరకు 10శాతం డిస్కౌంట్ కూడా పొందవచ్చు. చివరిగా ఎక్స్చేంజ్ ఆఫర్ తో కొనుగోలుదారులు ఐఫోన్ 16పై గరిష్టంగా రూ. 42150 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అయితే స్మార్ట్ ఫోన్ మోడల్స్, వర్కింగ్ కండిషన్స్ ఆధారంగా ఎక్స్చేంజ్ ఉంటుంది.

కొత్త కెమెరా లేఅవుట్, కొత్త తరం చిప్సెట్, క్వాలిటీ కెమెరా, ముఖ్యంగా ఆపిల్ ఇంటెలిజెన్స్ వంటి కొన్ని ప్రధాన అప్ డేట్స్ తో ఐఫోన్ 16 వస్తుంది. కెమెరా ఫీచర్లను యాక్సెస్ చేసేందుకు లేదా ఏఐ ఆధారిత విజువల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను యాక్టివేట్ చేసేందుకు ఉపయోగించే కొత్త కెమెరా కంట్రోల్ బటన్ ను కూడా ఆపిల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఐఫోన్ 16 మెరుగైన పనితీరు కోసం 8 జీబీ ర్యామ్ తో వస్తుంది. ఏ 18 చిప్ తో ఇది రన్ అవుతుంది. ఆపిల్ విజన్ ప్రో కోసం రికార్డింగ్ ను సపోర్ట్ చేసేందుకు స్మార్ట్ ఫోన్ నిలువుగా ఉంచిన కెమెరా మాడ్యూల్ తో వస్తుంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ కెమెరా 12 మెగాపిక్సెల్ ఆల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి.

Tags:    

Similar News