ఇండియా ప్లే స్టోర్లలో Google Gemini యాప్.. తెలుగు, హిందీ వంటి 10 భాషలకు సపోర్ట్

ఇటీవల కాలంలో టెక్ కంపెనీలు తమ సొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్‌లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి

Update: 2024-06-18 09:33 GMT

దిశ, టెక్నాలజీ: ఇటీవల కాలంలో టెక్ కంపెనీలు తమ సొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్‌లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీ, బింగ్ వంటివి అందుబాటులోకి రాగా, తాజాగా దిగ్గజ కంపెనీ గూగుల్ సంస్థ అభివృద్ధి చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్ Gemini యాప్ ఇప్పుడు ఇండియాలో కూడా అందుబాటులోకి వచ్చిందని సీఈఓ సుందర్ పిచాయ్ మంగళవారం ప్రకటించారు. అమెరికా వినియోగదారుల కోసం ఫిబ్రవరిలో ఈ యాప్‌ను మొదటిసారిగా లాంచ్ చేశారు. ప్రస్తుతం ఇండియాలో గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్ అందుబాటులో ఉందని గూగుల్ ప్రకటించింది. ఇది మొత్తం 10 భాషలకు మద్దతు ఇస్తుంది. అవి ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళం, తెలుగు,ఉర్దూ.

AI చాట్‌బాట్‌కి యాక్సెస్ పొందడానికి, యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా Google అసిస్టెంట్ ద్వారా ఎంచుకోవచ్చు. ఐఓఎస్ వినియోగదారులు గూగుల్ యాప్ ద్వారా మాత్రమే దీన్ని యాక్సెస్ చేయగలరు. Gemini యాప్ పెద్ద భాషా నమూనాల (ఎల్‌ఎల్‌ఎమ్‌లు) సామర్థ్యాలకు వినియోగదారులకు యాక్సెస్ అందిస్తుందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఎక్స్‌లో ఒక పోస్ట్ ద్వారా తెలిపారు. ఇంకా, జెమిని అడ్వాన్స్‌డ్ - పెద్ద టోకెన్ కాంటెక్స్ట్ విండోతో Google One సబ్‌స్క్రిప్షన్ LLM‌ను కూడా అప్‌గ్రేడ్ చేస్తున్పారు. అలాగే, గూగుల్ మెసేజెస్ యాప్‌లో జెమినిని ప్రవేశపెడుతున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఈ ఫీచర్ ఇప్పటికే ఇతర దేశాల్లో ఉండగా, ఇప్పుడు భారతీయ వినియోగదారులు మెసేజెస్ యాప్‌లో AI చాట్‌బాట్‌తో చాటింగ్ చేయవచ్చు. 6GB RAM లేదా అంతకంటే ఎక్కువ ఉన్న Android యూజర్లు దీనిని పొందవచ్చు.


Similar News