Google క్రోమ్ బ్రౌజర్‌కు మైక్రోసాఫ్ట్ బింగ్ చాట్ సపోర్ట్

మైక్రోసాఫ్ట్ తన బింగ్ చాట్, బింగ్ చాట్ ఎంటర్‌ప్రైజ్ సపోర్ట్‌ను గూగుల్ క్రోమ్ వినియోగదారులకు అందుబటులోకి తెస్తుంది.

Update: 2023-08-30 04:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: మైక్రోసాఫ్ట్ తన బింగ్ చాట్, బింగ్ చాట్ ఎంటర్‌ప్రైజ్ సపోర్ట్‌ను గూగుల్ క్రోమ్ వినియోగదారులకు అందుబాటులోకి తెస్తుంది. ఇంతకుముందు ఎడ్జ్ బ్రౌజర్‌లో మాత్రమే బింగ్ చాట్ సపోర్ట్ ఉండేది, అయితే ఇప్పుడు Windows, macOS, Linux యూజర్ల కోసం ఈ ఫీచర్‌ను తెచ్చారు. త్వరలో డెస్క్‌టాప్, మొబైల్‌లోని ఇతర బ్రౌజర్లలో కూడా ఈ ఫీచర్‌ను తీసుకురానున్నారు.

మైక్రోసాఫ్ట్ తన బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్న దాని ప్రకారం, ప్రస్తుతం డెస్క్‌టాప్ కంప్యూటర్‌లలో క్రోమ్ బ్రౌజర్‌లో బింగ్ చాట్ సపోర్ట్ ఉంది. Windows, macOS, Linuxలో క్రోమ్ బ్రౌజర్‌లో బింగ్ చాట్ యాక్సెస్ పొందవచ్చు. బింగ్ చాట్ ద్వారా వేగవంతంగా కంటెంట్ సెర్చ్ చేయవచ్చని, అలాగే దీని కోసం AI కూడా సహాయం చేస్తుందని కంపెనీ తెలిపింది. దీంతో వినియోగదారులు తమ ప్రశ్నలకు సులభంగా సమాధానాలు కనుగొనడంతో పాటు, సెర్చింగ్ ఆప్షన్ కూడా చాలా ఈజీగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. Appleకు చెందిన Safari బ్రౌజర్‌కు కూడా బింగ్ చాట్ సపోర్ట్‌ను ఇవ్వాలని కంపెనీ ప్రయత్నిస్తుంది.

Tags:    

Similar News