WhatsAppలో ఇ-మెయిల్ వెరిఫికేషన్ ఆప్షన్

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో కొత్తగా మరో ఆప్షన్‌ను తీసుకొచ్చారు.

Update: 2023-11-21 12:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో కొత్తగా మరో ఆప్షన్‌ను తీసుకొచ్చారు. అదే ఇ-మెయిల్ వెరిఫికేషన్ సదుపాయం. గతంలో ఈ ఫీచర్‌ను తీసుకొస్తామని కంపెనీ ప్రకటించగా తాజాగా ఇప్పుడు విడుదల చేసింది. ముందుగా దీనిని ఐఓఎస్ వినియోగదారులకు మాత్రమే అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ యూజర్లకు త్వరలో విడుదల చేయనున్నారు. వాట్సాప్ లాగిన్ టైంలో SMS ఆధారంగా లాగిన్ అవసరం లేకుండా ఇ-మెయిల్ ద్వారా లాగిన్ కావడానికి ఇది ఉపయోగపడుతుంది.

నెట్‌వర్క్ కవరేజ్ లేని సమయాల్లో ఇ-మెయిల్ ద్వారా లాగిన్ కావచ్చు. ఐఓఎస్ యూజర్లు వాట్సాప్ సెట్టింగ్‌లోకి వెళ్లి అకౌంట్ ఆప్షన్‌పై క్లిక్ చేసి ఇ-మెయిల్‌ను యాడ్ చేసుకోవచ్చు. ఇది వెరిఫికేషన్ కోసం మాత్రమే ఉపయోగపడుతుంది. యూజర్లు ఖచ్చితంగా ఫోన్ నెంబర్‌ను కలిగి ఉండాలి. అది లేకపోతే లాగిన్ కావడం కుదరదు. కంపెనీ త్వరలోAI చాట్ ఫీచర్‌ను కూడా తీసుకువస్తుంది. దీనిని మొదటగా బీటా టెస్టర్లకు విడుదల చేస్తున్నారు. అన్ని టెస్టింగ్‌లు పూర్తయ్యాక అందరికి విడుదల చేయనున్నారు.

Tags:    

Similar News