చంద్రుడిపై కాలనీల నిర్మాణం.. ఎప్పటికి పూర్తవుతుందో తెలుసా..
ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో చంద్రుడిపై మనిషిని మొదటిసారిగా దింపడానికి రష్యా, అమెరికా మధ్య పోటీ జరిగింది.
దిశ, ఫీచర్స్ : ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో చంద్రుడిపై మనిషిని మొదటిసారిగా దింపడానికి రష్యా, అమెరికా మధ్య పోటీ జరిగింది. ఈ విషయంలోనే చంద్రుడిపై ఎవరు మొదట స్థావరాన్ని నిర్మించగలరు అనే విషయం పై పోటీ జరుగుతుంది. అయితే చంద్రుడిపై మిలియన్ల కిలోమీటర్ల దూరంలో కాలనీని నిర్మించడం వల్ల భూమి పై ఉన్న మానవులకు ఏమి లాభం అనే ప్రశ్న తలెత్తుతుంది.
మొదటిసారిగా 1969లో నాసా అపోలో మిషన్ ద్వారా మానవుడు చంద్రుడిపై అడుగు పెట్టాడు. 50 ఏళ్ల తర్వాత ప్రయివేటు సంస్థలు సైతం చంద్రన్న మిషన్లు ప్రారంభించే పరిస్థితి నెలకొంది. ఇటీవల ఇంటూటివ్ మెషీన్స్ అనే ప్రైవేట్ అమెరికన్ కంపెనీ చంద్రుని ఉపరితలం పై తన మూన్ ల్యాండర్‌ను ల్యాండ్ చేసి చరిత్ర సృష్టించింది. అంతకుముందు జపాన్ కూడా అంతరిక్ష నౌకను విజయవంతంగా ల్యాండ్ చేసి రికార్డు సృష్టించింది.
చంద్రుడిపై వనరుల నిల్వ
చంద్రుడిపై ఇనుము, టైటానియం, ఇతర ఉపయోగకరమైన మూలకాల ఉనికిని గుర్తించారు శాస్త్రవేత్తలు. భూమిపై అరుదైన పరిమాణంలో మాత్రమే లభించే అటువంటి విలువైన ఖనిజాల నిల్వలు ఇక్కడ ఉండవచ్చని పేర్కొన్నారు. ఈ వనరుల కోసం చాలా దేశాలు, కంపెనీలు చంద్రుడిపై కాలనీని స్థాపించడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. చంద్రుడిపై అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకోవడానికి, చాలా దేశాలు అమెరికాతో ఆర్టెమిస్ ఒప్పందం పై సంతకం చేశాయి. పరస్పర సహకారంతో చంద్రుడిపై బేస్ క్యాంపును నిర్మించడం, వనరులను అన్వేషించడం ఒప్పందం లక్ష్యం. ఫిబ్రవరి 2024 నాటికి భారతదేశం, కెనడాతో సహా సంతకం చేసిన ఒప్పందాల సంఖ్య 36 కి చేరుకుంది.
మార్స్ మిషన్ ఊపందుకుంటుంది..
భూమి నుండి అంగారక గ్రహంపైకి మిలియన్ల మంది ప్రజలను తీసుకెళ్లేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు ఎలోన్ మస్క్ ఇటీవల చెప్పారు. అయితే అంగారక గ్రహానికి వెళ్లే ముందు, చంద్రుడిని జయించవలసి ఉంటుంది. చంద్రుడిపై స్థావరాన్ని నిర్మించడంలో మానవులు విజయవంతమైతే, అది అంగారక గ్రహానికి సంబంధించిన మిషన్‌ను కూడా వేగవంతం చేస్తుంది. వాస్తవానికి, చంద్రుడిపైకి వెళ్లి అక్కడ ఎక్కువ సేపు ఉండడం వల్ల మానవ శరీరం మరొక ఖగోళ శరీరం గురుత్వాకర్షణ, వాతావరణానికి ఎలా స్పందిస్తుందో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. దీనితో అంగారక గ్రహం వంటి ఖగోళం పై నివసించడం మన ఆరోగ్యం, నిద్ర, మనస్తత్వశాస్త్రం పై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో మనం బాగా అర్థం చేసుకోగలుగుతాము. చంద్రుడిని స్థావరంగా మార్చడం ద్వారా అక్కడి నుంచి అంగారకుడిపైకి కూడా వ్యోమనౌకలను పంపవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ఇతర అంతరిక్ష మిషన్లు, కొత్త పరిశ్రమలకు ప్రోత్సాహం..
చంద్రుడిపై స్థావరాన్ని నిర్మించడం ఇతర అంతరిక్ష యాత్రలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. చంద్రుని గురుత్వాకర్షణ శక్తి భూమి కంటే తక్కువ బలంగా ఉంది. రాకెట్లను ప్రయోగించడానికి దీన్ని ఉపయోగించవచ్చు. వాస్తవానికి, భూమి నుండి రాకెట్‌ను ప్రయోగించడం చాలా ఖరీదుతో కూడుకున్న చర్య. ఎందుకంటే చంద్రుడి నుండి కంటే భూమి గురుత్వాకర్షణ నుండి తప్పించుకోవడానికి చాలా ఎక్కువ ఇంధనం ఖర్చు అవుతుంది. చంద్రుడిపై స్థావరాన్ని నిర్మిస్తే అక్కడి నుంచి రాకెట్ ప్రయోగం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
లూనార్ బేస్, స్పేస్ మిషన్లు కొత్త పరిశ్రమలను ప్రోత్సహించడమే కాకుండా ఉద్యోగ అవకాశాలను కూడా సృష్టిస్తాయి. నాసా నివేదిక ప్రకారం, 'మూన్ టు మార్స్' కార్యక్రమం స్థానిక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలకు విస్తృత ప్రయోజనాలను కలిగి ఉంటుంది. దీనివల్ల వేల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఇది కాకుండా దేశ ఆదాయంలో 1.5 బిలియన్ డాలర్ల పెరుగుదల ఉంటుందని అంచనా.
కాలనీల నిర్మాణం ఎప్పుడు ?
ఇటీవల భారతదేశం, జపాన్‌తో సహా అనేక దేశాలు చంద్రునిపైకి తమ మిషన్లను పంపాయి. కానీ వీటిలో చాలా మిషన్లు తమ లక్ష్యాలను సాధించడంలో విఫలమయ్యాయి. మనిషి 1969లో చంద్రుడిపైకి చేరుకున్నప్పటికీ, 5 దశాబ్దాల తర్వాత కూడా చంద్రుడిపైకి మిషన్‌ను పంపడం అంత సులభం కాదు. చంద్రుడిపై స్థావరాన్ని నిర్మించడం గురించి మనం మాట్లాడినట్లయితే ప్రస్తుతం ఈ రేసులో అమెరికా ముందుంది. 2030 నాటికి చంద్రుడిపై శాశ్వత మానవ స్థావరాన్ని ఏర్పాటు చేయాలని అమెరికా యోచిస్తోంది. కానీ ఈ మిషన్ ఇప్పటికే ఆలస్యం అయింది. అమెరికాతో పాటు, చైనా కూడా తన సొంత చంద్ర స్థావరాన్ని నిర్మించుకునే పనిలో ఉంది. 2030లలో చంద్రునిపై స్థావరాన్ని నిర్మించడం దీని లక్ష్యం.
What makes the Moon's South Pole a great place for a lunar base?
— NASA Marshall (@NASA_Marshall) February 10, 2021
Three words: light, dark, and ice >> https://t.co/CacBX0Y58z @NASAArtemis pic.twitter.com/aW0IMKj23W