Airtel:తెలుగు రాష్ట్రాల్లో వరదలు..యూజర్లకు ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి.

Update: 2024-09-03 14:47 GMT
Airtel:తెలుగు రాష్ట్రాల్లో వరదలు..యూజర్లకు ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్:ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి. రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. వరదలు బీభత్సం సృష్టించాయి. ఏపీలోని విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో వరదల ప్రభావం తీవ్రంగా ఉంది. లక్షలాది మంది ప్రజలు ముంపునకు గురయ్యారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సహా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో నిమగ్నమై ఉంది. NDRF ఇతర సిబ్బంది హెలికాఫ్టర్‌లు, డ్రోన్‌ల ద్వారా ఆహారం అందిస్తున్నారు.

ఈ క్రమంలో ప్రముఖ టెలికాం దిగ్గజం Airtel వరదల్లో చిక్కుకున్న ప్రజలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో వరదల నేపథ్యంలో వినియోగదారులకు టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ ఆఫర్ ప్రకటించింది. ఇంకా రీఛార్జ్ చేసుకుని ప్రీపెయిడ్ యూజర్లకు అదనంగా నాలుగు రోజుల పాటు కాలింగ్ సదుపాయం కల్పించింది. అదే సమయంలో రోజుకు 1.5జీబీ చొప్పున ఉచిత డేటాను అందిస్తోంది. పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు బిల్లు చెల్లింపు గడువు వారం పాటు పెంచింది. ఇళ్లలో వైఫై కనెక్షన్లకు 4 రోజుల అదనపు వాలిడిటీ ఇచ్చింది.


Similar News