వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. ఆ సమస్యలకు చెక్!

వాట్సాప్ వినియోగ దారులకు అదిపోయే న్యూస్. వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో కస్టమర్స్‌ను ఆకట్టుకుంటూనే ఉంటుంది. తాజాగా మరో సరికొత్త యాప్‌తో వాట్సాప్ మన ముందుకు వచ్చింది.

Update: 2024-07-10 13:59 GMT

దిశ, ఫీచర్స్ : వాట్సాప్ వినియోగ దారులకు అదిపోయే న్యూస్. వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో కస్టమర్స్‌ను ఆకట్టుకుంటూనే ఉంటుంది. తాజాగా మరో సరికొత్త ఫీచర్‌తో వాట్సాప్ మన ముందుకు వచ్చింది. దాని పేరే వాట్సాప్ కాంటెక్ట్స్ కార్డ్. దీని వలన ఎలాంటి యూస్ ఉన్నదంటే? చాలా మంది వాట్సాప్ హ్యాక్ అవ్వడం లేదా, తెలియని వారు గ్రూప్స్ క్రియేట్ చేసి యూజర్స్‌ను ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. అయితే తమ వినియోగదారులను అలాంటి సమస్యల నుంచి కాపాడటానికి వాట్సాప్ సరికొత్త ఆలోచన చేసింది. దీనికి గాను మంచి ఫీచర్ తీసుకొచ్చింది.

ఈ ఫీచర్ ద్వారా మీరు మీకు తెలియకుండా ఏవైనా గ్రూప్స్‌లో యాడ్ గనుక అయినట్లైతే లేదా గ్రూప్‌లో చేరడానికి ముందు మీరు ఆ గ్రూప్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని చూడవచ్చు. మన కాంటాక్ట్‌ ఉన్నవారా? లేనివారా? ఎవరు ఈ గ్రూప్ క్రియేట్ చేశారు,దానికి సంబంధించిన పూర్తి సమాచారం అందులో ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ అండ్రాయిడ్,ఐఓఎస్ యూజర్ల వాట్సాప్‌కు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రానుంది.


Similar News