గూగుల్ పే వాడుతున్నవారికి గుడ్ న్యూస్..

ప్రస్తుతం చేతిలో డబ్బు ఉండాల్సిన పనే లేకుండా పోయింది. ఒక ప్పుడు డబ్బు కావాలంటే బ్యాంకు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు చేతిలో స్మార్ట్ ఫొన్ ఉంటే సరిపోతుంది. చిన్న చిన్న అవసరాల నుంచి పెద్దమొత్తంలో

Update: 2024-01-18 09:36 GMT

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం చేతిలో డబ్బు ఉండాల్సిన పనే లేకుండా పోయింది. ఒక ప్పుడు డబ్బు కావాలంటే బ్యాంకు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు చేతిలో స్మార్ట్ ఫొన్ ఉంటే సరిపోతుంది. చిన్న చిన్న అవసరాల నుంచి పెద్దమొత్తంలో లావాదేవీల వరకు అందరూ ఆన్‌లైన్ పేమెంట్సే చేస్తున్నారు. ఫోన్ పే, గూగుల్ పే, ఆమెజాన్ పే ఇలా ఎన్నో ఆన్ లైన్ యాప్స్ ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో గూగుల్ పే తమ వినియోగదారులకు గూడ్ న్యూస్ అందించింది. జీపే, తన సేవలను మరింత విస్తరించడానికి సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకువస్తుంది.ఇకపై యూపీఐ పేమెంట్స్ రూపాయిలోనే కాకుండా డాలర్ల రూపంలో చెల్లింపులు చేసేలా మరో ఫెసిలిటీ కల్పించబోతున్నట్లు తెలిపింది. డాలర్‌ మాత్రమే కాదు వివిధ దేశాల కరెన్సీని పంపించేలా చర్యలు తీసుకొస్తున్నారు. ఇందు కోసం నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI), ఇంటర్నేషనల్‌ పేమెంట్స్‌ లిమిటెడ్‌తో గూగుల్‌ పే అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది.

దీనివలన విదేశాల్లో ఉన్న తమ కుటుంబ సభ్యులకు నగదు పంపే సమయంలో ఇంటర్నేషనల్ గేట్ వే ఛార్జీలు భారం తగ్గడమే కాకుండా,విదేశాలకు వెళ్లినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేమెంట్స్ చేసేందుకు వీలు కలుగుతుంది.

Tags:    

Similar News