ఆగిపోయిన చంద్రబాబు వాహనం

దిశ ప్రతినిధి, నల్లగొండ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆయన రోడ్డుపై 20 నిముషాల పాటు నిరీక్షించారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి జాతీయ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… చంద్రబాబు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా నార్కట్‌పల్లికి రాగానే తాను ప్రయాణిస్తున్న కారు సాంకేతిక కారణాల వల్ల ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో ఆయన నార్కట్‌పల్లి జాతీయ రహదారిపై నిరీక్షించాల్సి వచ్చింది. అనంతరం మరో బుల్లెట్ ప్రూఫ్ […]

Update: 2020-11-13 08:04 GMT

దిశ ప్రతినిధి, నల్లగొండ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆయన రోడ్డుపై 20 నిముషాల పాటు నిరీక్షించారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి జాతీయ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… చంద్రబాబు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా నార్కట్‌పల్లికి రాగానే తాను ప్రయాణిస్తున్న కారు సాంకేతిక కారణాల వల్ల ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో ఆయన నార్కట్‌పల్లి జాతీయ రహదారిపై నిరీక్షించాల్సి వచ్చింది. అనంతరం మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ఆయన హైదరాబాద్ బయలు దేరారు. ఇదిలావుంటే.. ప్రతి 20వేల కిలోమీటర్లకు ఒకసారి కారు క్లచ్ ప్లేట్స్‌ను మార్చాల్సి ఉంది. అయితే చంద్రబాబు ప్రయాణించే ప్రధాన కారును ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదు. ఇప్పటికే ఈ కారు 60వేల కిలోమీటర్లకు పైగా చంద్రబాబు ప్రయాణించే మెయిన్ క్వానయ్ తిరగడం గమనార్హం.

Tags:    

Similar News