ఓటింగ్‌లో టెక్కీలకు ప్రత్యామ్నాయం అవసరం

దిశ, తెలంగాణ బ్యూరో: బల్దియా ఎన్నిక‌ల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఓటు హ‌క్కు వినియోగానికి ముందుకు రాలేదని టీటా గ్లోబ‌ల్ ప్రెసిడెంట్ సందీప్ మ‌క్తాల స్పష్టం చేశారు. గ‌చ్చిబౌలిలో ఓటు హ‌క్కు వినియోగించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. వివిధ కార‌ణాల వ‌ల్ల దాదాపు 80 శాతం మంది టెక్కీలు ఓటు హ‌క్కును వినియోగించుకోలేదన్నారు. టెక్కీల ఓట్ల శాతం పెరిగేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. హైద‌రాబాద్‌లో 5.82 ల‌క్షల మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఉన్నారని, […]

Update: 2020-12-01 07:47 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బల్దియా ఎన్నిక‌ల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఓటు హ‌క్కు వినియోగానికి ముందుకు రాలేదని టీటా గ్లోబ‌ల్ ప్రెసిడెంట్ సందీప్ మ‌క్తాల స్పష్టం చేశారు. గ‌చ్చిబౌలిలో ఓటు హ‌క్కు వినియోగించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. వివిధ కార‌ణాల వ‌ల్ల దాదాపు 80 శాతం మంది టెక్కీలు ఓటు హ‌క్కును వినియోగించుకోలేదన్నారు. టెక్కీల ఓట్ల శాతం పెరిగేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. హైద‌రాబాద్‌లో 5.82 ల‌క్షల మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఉన్నారని, వీరిలో ప్రస్తుతం 80% మంది గ్రామాల నుంచి పని చేస్తున్నారని చెప్పారు.

కొవిడ్ మ‌హ‌మ్మారి కార‌ణంగా వారి నివాసాల నుంచే ప‌ని చేసుకునే ప‌రిస్థితి తప్పనిసరి అయ్యింది. అలాంటి వారు ఓటు హక్కును వినియోగించలేదన్నారు. పోలింగ్ శాతం తగ్గడానికి మ‌రో పెద్ద కార‌ణం స్థానికేత‌రులని చెప్పారు. హైద‌రాబాద్ ఐటీ ప‌రిశ్రమలోని టెక్కీల్లో దాదాపు 20 నుంచి 25 శాతం మాత్రమే హైద‌రాబాద్ న‌గ‌ర‌ వాసులు ఉండ‌గా, మిగ‌తా వారు ఇత‌ర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వ‌చ్చిన వారేన‌న్నారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల విష‌యంలో ఆస‌క్తిని చూపి ఉండ‌క‌పోవ‌చ్చున‌న్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో టెక్కీల ఓటింగ్ శాతం త‌గ్గకుండా ఉండేందుకు ఆన్‌లైన్ ఓటింగ్, పోస్టల్​ బ్యాలెట్ వంటి సౌల‌భ్యాలు క‌ల్పిస్తే బాగుంటుంద‌ని అభిప్రయపడ్డారు.

 

Tags:    

Similar News