త్వరలోనే దేశంలో ‘5జీ’ సేవలు..?

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో 5జీ టెక్నాలజీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పలు దిగ్గజ ఐటీ కంపీనెలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా దేశీయంగా 5జీ, 6జీ టెక్నాలజీ అభివృద్ధి, విస్తరణ కోసం దేశీయ దిగ్గజాలైన టెక్ మహీంద్రా, విప్రో సంస్థలు ఫిన్‌లాండ్ కంపెనీల సహకారం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. దేశీయంగా 5జీ సేవలను విస్తరించేందుకు ఫిన్‌లాండ్‌కు చెందిన నోకియా కంపెనీ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నట్టు సెంట్రల్ యూరప్ ఇన్‌ఛార్జ్ జాయింట్ సెక్రటరీ నీతా భూషణ్ చెప్పారు. ‘గతంలో 2జీ, 3జీ, 4జీ […]

Update: 2021-03-18 06:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో 5జీ టెక్నాలజీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పలు దిగ్గజ ఐటీ కంపీనెలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా దేశీయంగా 5జీ, 6జీ టెక్నాలజీ అభివృద్ధి, విస్తరణ కోసం దేశీయ దిగ్గజాలైన టెక్ మహీంద్రా, విప్రో సంస్థలు ఫిన్‌లాండ్ కంపెనీల సహకారం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. దేశీయంగా 5జీ సేవలను విస్తరించేందుకు ఫిన్‌లాండ్‌కు చెందిన నోకియా కంపెనీ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నట్టు సెంట్రల్ యూరప్ ఇన్‌ఛార్జ్ జాయింట్ సెక్రటరీ నీతా భూషణ్ చెప్పారు.

‘గతంలో 2జీ, 3జీ, 4జీ టెక్నాలజీలను అభివృద్ధి చేయడంతో ఫిన్‌లాండ్ కీలకంగా ఉంది. ఇప్పుడు 5జీ కోసం టెక్ మహీంద్రా, విప్రో సంస్థలతో కలిసి ఫిన్‌లాండ్ కంపెనీలు 5జీని అభివృద్ధి చేస్తాయని, అలాగే రానున్న రోజుల్లో 6జీ కోసం కూడా పనిచేయనున్నట్టు’ నీతా భూషణ్ వివరించారు. దేశీయంగా ఇటీవల 5జీ టెక్నాలజీకి ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే పలు కంపెనీలు ఈ సాంకేతికతను వినియోగించేందుకు సిద్ధంగా ఉన్నాయి.

 

Tags:    

Similar News