రెండో టెస్టులో టీమిండియా రికార్డుల జోరు

దిశ, వెబ్‌డెస్క్: మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 70 పరుగుల టార్గెట్‌ను భారత్ సునాయాసంగా చేధించింది. లక్ష్య చేధనలో ఓపెనర్ మయాంక్ అగర్వాల్(5), పుజారా(3) విఫలమైనా.. గిల్(35), రహనే(27) మరోసారి రాణించారు. దీంతో రెండో టెస్టు మ్యాచ్‌ను భారత్ నాలుగు రోజుల్లోనే ముగించింది. కాగా, ఈ ఫలితంతో నాలుగు టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది. ఇదిలా ఉంటే తొలి టెస్టులో ఓటమికి […]

Update: 2020-12-29 08:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 70 పరుగుల టార్గెట్‌ను భారత్ సునాయాసంగా చేధించింది. లక్ష్య చేధనలో ఓపెనర్ మయాంక్ అగర్వాల్(5), పుజారా(3) విఫలమైనా.. గిల్(35), రహనే(27) మరోసారి రాణించారు. దీంతో రెండో టెస్టు మ్యాచ్‌ను భారత్ నాలుగు రోజుల్లోనే ముగించింది. కాగా, ఈ ఫలితంతో నాలుగు టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది.

ఇదిలా ఉంటే తొలి టెస్టులో ఓటమికి ప్రతీకారంగా భారత్ రెండో టెస్టులో పగ తీర్చుకుంది. ఆసీస్‌ను చిత్తుగా ఓడించి సిరీస్ సమం చేసింది. అంతేగాకుండా ఈ మ్యాచ్‌తో టీమిండియా ఆటగాళ్లు పలు రికార్డులు క్రియేట్ చేశారు. టీమిండియా శ్రమించిన తీరు, జట్టు విజయం సాధించడం కన్నా సంతోషం అభినందనీయం అని పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసించారు.

మెల్‌బోర్న్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా బూమ్రా రికార్డు సృష్టించాడు. రెండు టెస్టులు, నాలుగు ఇన్నింగ్స్‌లో 15 వికెట్లు తీసి ఈ ఫీట్ సాధించాడు. అంతేగాకుండా 2018 బాక్సింగ్‌ డే టెస్టు తర్వాత ఆసీస్‌ను రెండో భారత్ ఓడించి అరుదైన ఘనత సాధించింది. ఆసియా జట్లలో ఆసీస్‌ను ఎక్కువసార్లు ఓడించిన జట్టుగా భారత్ రికార్డు నెలకొల్పింది. అంతేగాకుండా ఆస్ట్రేలియాలో టెస్టు విజయం అందించిన కెప్టెన్లలో ఒకడిగా రహానే నిలిచాడు. గతంలో కోహ్లీ, గంగూలీ, అనిల్ కుంబ్లే, సునీల్ గవాస్కర్, బిషన్ సింగ్ ఈ ఫీట్ సాధించారు.

Tags:    

Similar News